ఆ హీరోయిన్ పాలిట శత్రువుగా మారిన చిరంజీవి..!!

N.ANJI
చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది హీరోయిన్స్ వచ్చి వారి అదృష్టాన్ని పరీక్షించుకొని వెళ్తుంటారు. వారిలో ఆలా వచ్చిన వారిలో కొందరు తమ నటనతో అందంతో కొందరు మాత్రమే అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. అలాంటి హీరోయిన్స్ లో ఒక్కరు మోహిని. ఈమె పేరు చెబుతే చాలా మందికి గుర్తుకు రాకపోవచ్చు. ఆమె నటసింహం నందమూరి బాలకృష్ణ క్లాసిక్ మూవీ 'ఆదిత్య 369' హీరోయిన్‌ గా నటించారు. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ పేరే మోహిని.

మోహిని నటించిన ఆదిత్య 369' సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అందరికి తెల్సిందే. ఈ చిత్రంలో  హీరోయిన్ మోహిని నటనకు ప్రశంసలు అందుకుంది. అయితే ఆమె  హిట్లర్ మూవీ లో చిరంజీవికి చెల్లెలిగా కూడా నటించింది. మోహిని క్క తెలుగు భాష లోనే కాకుండా మలయాళం తమిళ సినిమాలలో కూడా నటించిన ఇమె..దాదాపు 100పైగా సినిమాల్లో నటించారు.  
 
అంతేకాదు.. మోహిని కొన్ని కోట్ల మంది హిందువులకు గురువు అయిన రమణ మహర్షికి వరుసకు మనవరాలు అవుతుందంట. ఇక ఆమె తన సినీ కెరీర్ గురించిన ముచ్చట్లను చెబుతూ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆమె తన విషయాలను ఓపెన్ గా మాట్లాడారు. అయితే తన జీవితంలో మలుపులెన్నో ఉన్నాయని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. తన లైఫ్ ఇలా అయిపోవడానికి పరోక్ష కారణం చిరంజీవి అంటూ షాక్ గురి చేసింది.

మోహిని తన అందంతో నటనతొ మిగతా భాషల్లో మెప్పించగల్గిన ఈమె తెలుగు అభిమానులను ఆకట్టుకున్న హీరోయిన్ గా మాత్రం అవకాశాలు అందుకోలేకపోయింది. అందుకు కారణం చిరంజీవి సినిమా నే అంతూ బిగ్ బాంబ్ పేల్చింది ఈ భామ. అదేంటంటే.. చిరంజీవి హిట్లర్ సినిమాలో ఆయనకు చెల్లెలుగా నటించిన ఈమె ఆ తరువాత హీరోయిన్ గా అవకాశాలు రాలేదని చెప్పుకొచ్చింది. తనకు అవకాశాలు ఎందుకు రావడం లేదని డైరెక్టర్స్ ని అడిగితే..ఇప్పటికే చెల్లిగా నటించావు..మళ్ళీ హీరోయిన్ అంటే ప్రేక్షకులు చూడరని సందేహాలు వ్యక్తం చేస్తారని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: