"బిగ్ బాస్ సీజన్ 6" హోస్ట్ రేస్ లో టాప్ హీరోలు... ?

VAMSI
తెలుగు బుల్లి తెరపై బిగ్గెస్ట్ షో అంటే తడుముకోకుండా బిగ్ బాస్ అని చెప్పేయొచ్చు. అంతగా ఈ షో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై పోయింది. డైలీ స్పెషల్ సీరియల్ లాగా ఆడియన్స్ ఈ షో కి అడిక్ట్ అయిపోయారు. ఇప్పటికే బిగ్ బాస్ షో తెలుగులో అయిదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరవ సీజన్ కూడా త్వరలో మన ముందుకు రాబోతోంది. ఇప్పటికే సీజన్ 6 కోసం కంటెస్టెంట్స్ ను కూడా ఫైనలైజ్ చేసినట్లు చెబుతున్నారు. సీజన్ 3, 4, 5 లకు వరుసగా హోస్ట్ గా అక్కినేని నాగార్జున అలరించగా ఇపుడు సీజన్ 6 కి కూడా నాగ్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు అని చెప్పారు.

అయితే తాజా సమాచారం ప్రకారం సీజన్ 6 కి నేను హోస్ట్ గా చేయను అని ఆ బాధ్యతలను తిరస్కరించారట నాగ్. అసలు ఇలా ఎందుకు చేశారు అంటే కారణం బిగ్ బాస్ యాజమాన్యం అనే అంటున్నారు. నాగ్ కొత్తగా రెండు కొత్త ప్రాజెక్టులకు ఒకే చెప్పారని అందుకే ఆయన షో నుండి తప్పుకుంటున్నారని తెలుస్తోంది. అయితే మరో వైపు సీజన్ 6 లో ఒక కంటిస్టెంట్ ను తీసుకోకూడదని నాగ్ అభ్యంతరం చెప్పారని...అయితే ఈ విషయం గురించేనా అన్నది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, ఒక రూమర్ లా స్ప్రెడ్ అవుతోంది. అయితే చిత్రపురి నుండి అందుతున్న సమాచారం ప్రకారం  కొన్ని కారణాల వలన నాగ్  ఇపుడు సీజన్ 6 చేయను అంటున్నారని ఇంకొందరు చెబుతున్నారు.

అయితే ఇంకా ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ రాలేదు. ఈ విషయం అటుంచితే బిగ్ బాస్ సీజన్ సిక్స్ గడిచిన ఐదు సీజన్ల కంటే భిన్నంగా ఉండనుంది అని.. సీజన్ సిక్స్  24 గంటల ఓటీటీ షో గా స్ట్రీమ్ అవనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ముందు ముందు ఈ విషయంపై ఏమైనా వార్త తెలుస్తుందా అన్నది చూడాలి. అయితే బిగ్ బాస్ ఇప్పటికే ఇందుకు హోస్ట్ గా ఎవరు అయితే బాగుంటుందని సెర్చింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నాగ్ కాకుండా మరో ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నాయట. వారిలో ఒకరు రానా కాగా మరొక్కరు విజయ్ దేవరకొండ. మరి ఫైనల్ గా ఎవరు ఈ షో ను హోస్ట్ చేయనున్నారా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: