నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా 'అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె' అనే టాక్ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు ఓ టి టి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోలో వరస సెలబ్రిటీస్ తో ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు బాలయ్య. ఆరుపదుల వయసులో హోస్ట్ గా సెలబ్రిటీస్ తో ఇంటర్వ్యూలను బాలయ్య హ్యాండిల్ చేసే విధానం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే వరుస ఎపిసోడ్స్ తో దూసుకుపోతున్న ఈ షోలో తాజాగా దగ్గుబాటి వారబ్బాయి రానా కూడా అ గెస్ట్ గా విచ్చేశాడు. అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేసింది ఆహా. ఇక ఈ ప్రోమోలో బాలకృష్ణ- రాణా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ప్రోమో చూస్తుంటే రానా ని బాలయ్య బాగా ఆటపట్టించినట్లున్నాడు. అంతేకాదు ఈ ప్రోమోలో ఇద్దరూ కొన్ని ప్రశ్నలను కూడా వేసుకున్నట్లు కనిపిస్తోంది. వాటిలో భాగంగానే రానా..' మీ శ్రీమతి తో గొడవ పడినప్పుడు మీలో ఎవరు ముందు సారీ చెబుతారు? అని అడిగినప్పుడు వెంటనే బాలయ్య తానే అంటూ ఒక షో కార్డు చూపించారు. అంతేకాదు మీ భార్య కాళ్లు మీరు ఎప్పుడైనా పట్టుకున్నారా? అని రానా అడగగా వెంటనే..' నీకెందుకయ్యా అని ఫన్నీగా రియాక్ట్ అయిన బాలకృష్ణ.. కృష్ణుడు అంతటివాడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. అలాంటిది బాలకృష్ణుడిని నేను ఎంత' అని బాలయ్య అనడంతో వెంటనే షో లో నవ్వులు చిగురించాయి.
అంటే భార్య కాళ్ళు పట్టుకోవడంలో ఎలాంటి తప్పులేదు అంటూ బాలయ్య ఇచ్చిన తెలివైన సమాధానం ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది అనే చెప్పాలి. దీంతో ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ప్రోమో చూస్తుంటే కచ్చితంగా ఈ ఎపిసోడ్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ జనవరి 7వ తేదీన ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇక రానా సినిమాల విషయానికి వస్తే.. తాజాగా నటించిన 'విరాటపర్వం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల తేదీపై పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సివుంది...!!