సిరి జోలికెళ్లొద్దు.. రవి షాకింగ్ కామెంట్స్?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక్కటే హాట్ టాపిక్ గా మారిపోయింది. అదే ఐదేళ్ల నుంచి లవ్ రిలేషన్ షిప్ లో కొనసాగినా షణ్ముఖ్ దీప్తి సునైనా బ్రేకప్. షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఇక అతన్ని సపోర్ట్ చేయడానికి బిగ్బాస్ వరకూ వచ్చిన దీప్తి సునైనా.. బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఎందుకు బ్రేకప్ చెప్పింది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అదే సమయంలో ఇటీవల ఇంస్టాగ్రామ్ లైవ్ నిర్వహించిన దీప్తి సునయన మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులందరినీ బాధపెట్టింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో  సిరితో ఫ్రెండ్షిప్ కారణంగానే షణ్ముఖ్ దీప్తి సునైనా ల మధ్య బ్రేకప్ జరిగింది అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.


 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఎంతోమంది దీప్తి సునైనా అభిమానులు సిరి హనుమంతు ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కూడా చేస్తున్నారు. సిరి వల్లే ఎంతో ప్రేమగా ఉండే దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ లు విడిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇలాంటి సమయంలో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీ జీవితం చాలా కఠినంగా ఉంది అంటూ కామెంట్ చేస్తే.. వారి కంటే మరింత స్ట్రాంగ్ అని చిరునవ్వుతో సమాధానం చెప్పండి అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఎన్ని విమర్శలు వచ్చినా తాను స్ట్రాంగ్ గా ఉంటాను అంటూ సిరి ఇన్ డైరెక్ట్ గా చెప్పింది అని కొంతమంది భావిస్తున్నారు. ఇకపోతే సిరి  విషయంపై ఇటీవలే యాంకర్ రవి స్పందించాడు. రవి ప్రస్తుత ఇష్యూ గురించి కాదు ఒకప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై జరుగుతున్న విమర్శలు ట్రోల్స్ ని ఆపాలి అంటూ రవి ఆ మధ్య మాట్లాడిన ఒక వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఎవరిని ఏమి అనకండి మరీ ముఖ్యంగా సిరిని ఏమనకండి.. మంచిగా చెప్తున్న.. దయచేసి నెగిటివ్ కామెంట్లు చేయడం మానేయండి. షన్నూ బాగానే ఉన్నాడు త్వరలోనే అతనితో మాట్లాడి వీడియో కూడా చేస్తాను అంటూ రవి చెప్పుకొచ్చిన ఒక వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: