షాకింగ్ : ప్రభాస్ రాధేశ్యామ్ కూడా పొస్ట్ పోన్ .... ??

GVK Writings
త్వరలో రానున్న సంక్రాంతి సీజన్ సందర్భంగా వాస్తవానికి ఈ పాటికి సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఆ తరువాత ఆర్ఆర్ ఆర్ ని జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన రావడంతో అంతపెద్ద మూవీ వస్తున్న సమయంలో తమ సినిమాలు రిలీజ్ చేయడం సబబు కాదని భావించిన మహేష్, పవన్ ఇద్దరూ తమ సినిమాలను వాయిదా వేసుకున్న సంగతి తెల్సిందే.

ఇక ఈ సంక్రాంతి రానున్న బడా సినిమాల్లో కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న బంగార్రాజుతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేస్తున్న రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉన్నాయి. అయితే ఆర్ ఆర్ ఆర్ కూడా రెండు రోజుల క్రితం కరోనా కారణంగా పలు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీ విధించడంతో వాయిదా పడింది. దానితో అందరి దృష్టి ఎక్కువగా రాధేశ్యామ్ పైనే పడింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా మనోజ్ పరమహంస ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్, మంచి యాక్షన్ తో కూడిన రొమాంటిక్ లవ్ కం ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ అందరినీ ఎంతో ఆట్టుకుని మూవీ పై బాగా అంచనాలు పెంచాయి.

ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సంక్రాంతికి రాధేశ్యామ్ కూడా రావడం కష్టమే అని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీ కావడంతో నార్త్ లో ఎక్కువ రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ ఉండడంతోపాటు ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ఈ పరిస్థితుల్లో రిస్క్ చేసి రాధేశ్యామ్ ని రిలీజ్ చేయడం కంటే వాయిదా వేయడమే బెటర్ అని యూనిట్ ఆలోచన చేస్తున్నట్లు టాక్. కాగా పక్కాగా రాధేశ్యామ్ సంక్రాంతి బరిలో నిలుస్తుందా లేదా ఏంది పక్కాగా తెలియాలి అంటే మరొక మూడు రోజుల వరకు ఓపిక పట్టాలని, అనంతరం సినిమా రిలీజ్ విషయమై పూర్తి వివరాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: