వివాదాలకు పెట్టింది పేరు ఆర్జీవి.. ఈయన సినిమాల కన్నా కూడా ఎవరొకరిని గెలుకుతూ వార్తల్లొ నిలిచాడు.. అలా ఇప్పుడు టాలివుడ్ కు పెద్ద దిక్కూయ్యాడు.ఇండస్ట్రీ పెద్ద అనే అంశం కొన్ని రోజులు చర్చలకు దారి తీసింది. 'మా' ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. తాజాగా నిన్న మెగాస్టార్ చిరంజీవి ఈ అంశంపై మాట్లాడుతూ నేను ఇండస్ట్రీ పెద్దగా ఉండను, కానీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉంటే మాత్రం ముందుకొస్తాను.. అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. ఎప్పుడూ సైలెంట్ గా వున్న చిరంజీవి ఇప్పుడు ఇలా మాట్లాడటం వెనుక అర్థం ఏంటో తెలియడం లేదని సినీ ప్రముఖులు ఆలోచనలొ ఉన్నారు.మోహన్ బాబు సినిమా టికెట్ల ఇష్యూ గురించి మాట్లాడుతూ లేఖ రాయడం మరింత చర్చకి దారి తీసింది. అయితే కొందరు గతంలో మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్ద అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.తాజాగా ఇండస్ట్రీ పెద్దగా రామ్ గోపాల్ వర్మ ఉండాలంటూ ఓ డైరెక్టర్ ట్వీట్ చేశాడు. సినిమా టికెట్ల విషయంలో ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడకపోయినా ఆర్జీవీ మాత్రం స్పందించడం విశేషం.
ఇకపోతే సినిమాల విషయం పై ఆర్జీవి అన్నారు.టికెట్ల రేట్లు, థియేటర్ల మూసివేతపై ఆర్జీవీ మాట్లాడాడు. ఇలాంటి టైంలో ఇండస్ట్రీ పెద్ద అనే అంశం తెరపైకి రావడంతో 'ఆర్ఎక్స్ 100' డైరెక్టర్, ఆర్జీవీ శిష్యుడు అజయ్ భూపతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. మా బాస్ రాంగోపాల్ వర్మని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చూడాలని నా కోరిక.. సామీ మీరు రావాలి సామీ.. ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా' అంటూ అజయ్ భూపతి తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి రామ్ గోపాల్ వర్మ ఫోటోను కూడా జత చేశాడు.అది కాస్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.. అందరినీ ఆలోచనలో పడేస్తుంది.. ఈ విషయం ఎంతవరకు వెలుగుతోంది అనేది చూడాలి..