అప్పట్లో ఆ హీరోతో నదియా పెళ్లి వరకు వెళ్లిందా..?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ కలిసి ఒకటి రెండు సినిమాల్లో నటించి వారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందంటే చాలు వారిద్దరి మధ్య లేనిపోని పుకార్లను మీడియా అంటగట్టేస్తూ ఉంటుంది. మరోవైపు దర్శకనిర్మాతలు కూడా హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయితే పదేపదే వాళ్లతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అలా గతంలో చేసుకుంటే బాలయ్య - విజయశాంతి, చిరంజీవి - రాధిక ఇలా ఎన్నో కాంబినేషన్స్ ఉన్నాయి. అదే సమయంలో ఈ రెండు జంటల మధ్య అప్పట్లో ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. ఇక ప్రేక్షకులు కూడా ఈ జంటను తెరపైన పదేపదే చూడాలని ఆశ పడుతుంటారు.

అలా సీనియర్ హీరో సురేష్, టాలీవుడ్ లో ప్రస్తుతం అత్తగా పాపులారిటీని సంపాదించుకున్న నదియా ఇద్దరూ జంటగా కలిసి గతంలో కొన్ని సినిమాల్లో నటించారు.ఈ ఇద్దరు కలిసి నటించిన ఓ తమిళ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వరుసగా కొన్ని సినిమాలు వచ్చాయి. అలా వీరిద్దరూ కలిసి ప్రతి సినిమాలో కనిపిస్తుండడంతో.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కొన్ని ప్రచారాలు అయితే అప్పట్లో బయటకు వచ్చాయి. ఇక దీనికి తోడు కొన్ని తమిళ దినపత్రికలు కూడా ఇవే వార్తలను నిత్యం రాస్తూ ఉండేది. దీంతో ఈ జంట మధ్య ప్రేమ వార్తలు బాగా హైలెట్ అయ్యాయి. 

అయితే ఇదే విషయమై సీనియర్ హీరో సురేష్ ని ఓ ఇంటర్వ్యూలో అడిగితే 'తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమేనని.. తమ మధ్య ఎలాంటి ఆలోచనలు లేవు' అని చెప్పుకొచ్చాడు. ఇక అప్పటి నుంచి సురేష్ ఓకే హీరోయిన్ తో కాకుండా తన సినిమాల్లో హీరోయిన్స్ ని మారుస్తూ ఉండేవాడు. ఇక తనపై ఈ పుకార్లు వచ్చిన తర్వాత నదియాతో సినిమా అవకాశం వచ్చినా కూడా అందుకు సురేష్ ఒప్పుకోలేదట. ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు సురేష్ అప్పట్లో హీరోయిన్ గా ఉన్న అనిత రెడ్డి ని పెళ్లి చేసుకున్నాడు. ఇక వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని వేర్వేరు వివాహం  చేసుకున్నారు. ఇక నదియా 1988లో శిరీష గాడ్ బోలె అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈమె సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అమ్మ, అత్త వంటి పాత్రల్లో నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: