ఆటిట్యూడ్ తో కెరీర్ ను చిన్నాభిన్నం చేసుకున్న యంగ్ హీరోయిన్... ?

VAMSI
సినిమా పరిశ్రమ అన్నాక సంతోషాలు ఉంటాయి, వివాదాలు ఉంటాయి. అయితే అన్నింటినీ సర్దుకుంటూ అందరితో కలిసి మెలసి వెళితేనే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండగలరు. అయితే ఒక యంగ్ హీరోయిన్ మాత్రం చిన్న చిన్న కారణాలతో తన కెరీర్ ను చిన్నాభిన్నం చేసుకుంది. కెరీర్‌ ఆరంభంలో ‘కుమారి 21 ఎఫ్‌’ సినిమాతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న హెబ్బా పటేల్ ను చూసి అంతా ఈ అమ్మాయి ఖచ్చితంగా పెద్ద హీరోయిన్ అవుతుంది, స్టార్ హీరోల సినిమాలకు ఫస్ట్ ఛాన్స్ గా ఉంటుంది అని ఊహించారు. అందుకు ఆమె అందం, దానితో పాటు ఆమె అభినయమే కారణం అని చెప్పాలి. అంతగా తన పర్ఫార్మెన్స్ తో యువతను కట్టి పడేసింది హెబ్బా.

అయితే గత కొన్నాళ్లుగా ఈమె కాస్త వెనుకపడింది, పైగా అనుకున్న స్థాయిలో ఛాన్స్ లు అందడం లేదు. ఆ మధ్య నితిన్ మూవీ ‘భీష్మ’లో అలా తళుక్కున మెరిసి ఇలా మాయమయింది. ఆ తర్వాత మళ్ళీ రామ్‌ ’రెడ్‌’ సినిమాలో ఐటెమ్‌ సాంగ్ లో కనిపించడం మినహా పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలు కానీ మంచి అవకాశాలు కానీ రాలేదు. అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు అని అంటున్నారు కొందరు సినీ ప్రముఖులు. హెబ్బా మంచి హీరోయిన్ కానీ ఎక్కువగా విశ్లేషిస్తుందట, తన పాత్ర సినిమాకే హైలెట్ గా ఉండాలని కండిషన్స్ పెడతారట , ఒకవేళ పాత్ర నచ్చినా సినిమాలో తన రోలే ఎక్కువగా స్పెషల్ గా  ఉండేలా కథని కాస్త మార్పులు చేయమని చెబుతారట.

హెబ్బా అందుకే ఆమెకు కథ చెప్పాలంటేనే కాస్త ఆలోచిస్తారట డైరెక్టర్లు. అలా ఆమె చాలా ఛాన్సులు మిస్స్ చేసుకున్నారని...అలా మిస్స్ చేసుకున్న అవకాశాలతో కొందరు స్టార్ హీరోయిన్లుగా అయ్యారని అంటుంటారు. అయితే దీని వలన ఇప్పుడిప్పుడే వస్తున్న హీరోయిన్ లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వచ్చిన సినిమా అవకాశాన్ని సరిగా వినియోగించుకోవాలి, లేనిపోని ఆటిట్యూడ్ చూపించి ఇండస్ట్రీలో ఉన్న వారి ముందు చులక అయిపోకూడదు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: