శివ కార్తికేయన్ మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్..!
జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనుదీప్ కెవి శివ కార్తికేయన్ తో కూడా ఓ సూపర్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో బైలిన్వల్ మూవీఎగా వస్తున్న ఈ సినిమా కోసం శివ కార్తికేయన్ ఏకంగా 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. తెలుగులో స్టార్ హీరోలకు ఈక్వల్ గా అతని రెమ్యునరేషన్ ఉంది. తెలుగులో పాతిక కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చే సరికి ఎక్కువ అని అనుకున్నారు. కాని శివ కార్తికేయన్ కు అక్కడ 30 కోట్లు ఇస్తున్నారు.
తమిళంలో శివ కార్తికేయన్ కు 60 కోట్ల దాకా మార్కెట్ ఉంది. ఇక డైరెక్ట్ తెలుగు సినిమా కాబట్టి తెలుగులో కూడా మంచి బిజినెస్ చేసే అవకాశం ఉంది. అదీగాక జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరక్టర్ కాబట్టి శివ కార్తికేయన్ సినిమా బిజినెస్ 70 కోట్ల పైన చేసే అవకాశం ఉంది. అందుకే శివ కార్తికేయన్ అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చి సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది మాత్రం త్వరలో తెలుస్తుంది.