లైంగిక వేధింపులపై సామ్ షాకింగ్ కామెంట్స్.
ఫ్యామిలీమేన్ వెబ్ సిరీస్ వల్లే చైసామ్ మధ్య గొడవలు వచ్చాయని ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. అయితే చైసామ్ మాత్రం విడాకుల ప్రకటనకు సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.ఇక విడాకుల ప్రకటన తర్వాత వైరల్ అయిన ఫేక్ వార్తల గురించి కూడా సమంత సీరియస్ గా రియాక్ట్ అయిన విషయం తెలిసిందే.ఇక తాజాగా సమంత ప్రముఖ రచయిత ఫరీదా డీ కోట్స్ ను పోస్ట్ చేయడం జరిగింది. కూతుళ్లకు కొన్ని విషయాలలో అనేక నిబంధనలు విధించి కట్టడి చేసే ముందు కొడుకులకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని సమంత అన్నారు. అలాగే మహిళలను కూడా లైంగికంగా వేధించకుండా కొడుకులను పెంచాలని సమంత సూచించారు. ఇక కూతుళ్లను కొన్ని విషయాలలో అడ్డుకోవడం ఒక విధంగా దాడి చేసినట్టేనని ఆమె చెప్పుకొచ్చారు. అయితే సమంత ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టారో అసలు క్లారిటీ లేదు.సామ్ ఇక తన పోస్టుల ద్వారా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారని ఆమె అభిమానులు భావిస్తున్నారు.