సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలని కోరుకోని
హీరోయిన్ అస్సలు ఎవరూ ఉండరు. కొంతమంది హీరోయిన్లు మహేష్ బాబుతో ఇప్పటికే నటించినా మళ్లీ కలిసి నటించాలని ఎంతగానో కోరుకుంటున్నారు. అయితే పెళ్లిసందడి సినిమాతో విజయం సాధించిన శ్రీలీల మాత్రం నిర్మాతలకు మహేష్ బాబు హీరో అయితేనే చేస్తానని షరతులు కూడా పెడుతున్నారని సమాచారం. పెళ్లిసందడి సినిమాతో శ్రీలీల యువతను బాగా ఆకర్షించింది . ఆ
సినిమా ఊహించని స్థాయిలో
సక్సెస్ సాధించడానికి శ్రీలీల కూడా ముఖ్య కారణమని చెప్పవచ్చు.
పెళ్లిసందడి సినిమాలో అద్భుతంగా ఎక్స్ ప్రెషన్లు ఇచ్చి శ్రీలీల ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ
బ్యూటీ రవితేజకు జోడీగా నటిస్తున్నది మహేష్ బాబుకు జోడీగా నటించి విజయం సాధిస్తే స్టార్
హీరోయిన్ గా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. టాలెంట్ పుష్కలంగా ఉన్న శ్రీలీల ఈ రీజన్ వల్లే మహేష్ సినిమాలో నటించాలనే కోరికను వ్యక్తపరుస్తూ ఉందని తెలుస్తుంది.త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబో మూవీలో సెకండ్
హీరోయిన్ శ్రీలీల అని గతంలో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయట..
అయితే ఆ వార్తలు అస్సలు నిజం కాలేదు. శ్రీలీల మహేష్ తో
సినిమా చేయాలని కోరుకుంటున్న నేపథ్యంలో
త్రివిక్రమ్ ఈ బ్యూటీకి తన సినిమాలో ఛాన్స్ ఇస్తారేమో చూడాలి మరీ . వయస్సు పెరుగుతున్నా కూడా ప్రేక్షకుల్లో మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట
మూవీ షూటింగ్ 40 రోజులు బ్యాలెన్స్ ఉందని సమాచారం.. 30 రోజుల పాటు మహేష్ పాల్గొనే సీన్లు ఉన్నాయని
మార్చి రెండవ వారానికి ఈ
సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన సర్కారు వారి పాట విడుదల కావాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయట.. గీతా గోవిందం సినిమాతో
బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న
పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ
మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ
సినిమా తెరకెక్కుతొందని సమాచారం.