పుష్ప : సెకండ్ పార్ట్ లో అదే అదుర్స్ అట ... ??
మరోవైపు పలువురు మీడియా వారు అలానే సినిమా ప్రముఖులు సైతం ఈ మూవీపై మంచి ప్రశంసలు కురిపిస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా సినిమాలో పుష్ప రాజ్ అనే మాస్ పాత్రలో కనబరిచిన అద్భుత నటనకు గాను అల్లు అర్జున్ పై అందరూ పొగడ్తలు కురిపిస్తుండడంతో పాటు సినిమాని మంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించి గొప్పగా కథ, కథనాలను అందించిన సుకుమార్ ని కూడా పలువురు ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ఇక రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా రెండవ పార్ట్ కి సంబంధించి ఇప్పటికే ముప్పై శాతం షూటింగ్ పూర్తికాగా మరొక రెండు నెలల్లో రెండవ పార్ట్ అయిన పుష్ప ది రూల్ మిగతా భాగం షూట్ ని యూనిట్ పట్టాలెక్కించనుందట.
అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 లో మరింత అద్భుతమైన యాక్షన్, మాస్ ఎపిసోడ్స్ ఉన్నాయని, అలానే పార్ట్ 2 లో పుష్ప రాజ్ క్యారెక్టర్ మరింతగా అదిరిపోతుందని సమాచారం. అలానే ఇందులో భన్వర్ సింగ్ షకావత్ తో పాటు దాక్షాయణి పాత్రలు మెయిన్ విలన్స్ గా కనిపించనున్నాయని అంటున్నారు. ఖర్చు, నిర్మాణాల విలువల పరంగా కూడా భారీగా నిర్మాతలు ఎక్కడా కూడా రాజీ పడకుండా దీనికి ఖర్చు చేయనున్నారని, దీనిని బట్టి అన్ని విధాలుగా పుష్ప ది రైజ్ కంటే పుష్ప ది రూల్ మరింత గ్రాండియర్ గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. మరి త్వరలో తెరకెక్కి ఆపై ఈ ఏడాది మధ్యలో ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్ప ది రూల్ మూవీ ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.