నేషనల్ క్రష్ రష్మిక మందన, నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ సినిమాలో రష్మిక మందన నటనకు, అందచందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కడంతో ఈ హాట్ బ్యూటీ కి టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే తెలుగునాట టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇప్పటివరకు సౌతిండియా భాషల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన త్వరలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.
గతంలోనే ఈ సినిమా స్టొరీ డిస్కషన్ లో ఈ నటుడితో కలిసి పాల్గొంది రష్మిక మందన. కాగా త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సందర్భం గా ఓ ఇంటర్వ్యూ లో సిద్ధార్థ్ మల్హోత్రా తో వర్క్ గురించి రష్మిక మందన మాట్లాడుతూ... సిద్ధార్థ మల్హోత్రా తో పనిచేయడం చాలా సరదాగా ఉంది. ఇంతకు ముందు మేము ఇద్దరం కలిసి నప్పుడు చాలా అంశాలపై మాట్లాడుకున్నాం. మేమిద్దరం సెట్స్ కలిసి తిన్నాం. చాలా సార్లు మేమిద్దరం కలిసి వర్కౌట్లు కూడా చేశాం. సిద్ధార్థ్ మల్హోత్రా అద్భుతమైన నటుడే కాకుండా మంచి వ్యక్తి కూడా మిషన్ మజ్ను ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది అని నేషనల్ క్రాష్ రష్మీక మందన తెలియజేసింది. ఇదిలా ఉంటే రష్మిక మందన తెలుగు లో ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.