జూనియర్ మాటలలో పొలిటికల్ స్లోగన్ షాక్ లో రాజకీయవర్గాలు !
జూనియర్ ఎన్టీఆర్ ను క్రియాశీలక రాజకీయాలలోకి రమ్మని గత కొంత కాలంగా తెలుగుదేశంలోని కొన్ని వర్గాలు అడుగుతున్నాయి. ఈ రాయబారాలకు జూనియర్ స్పందించకుండా ఇలాంటి విషయాల పై నిర్ణయం చెప్పడానికి ఇంకా చాల సమయం ఉంది అని చెపుతూ సమయం వచ్చినప్పుడు తానే ప్రకటిస్తాను అని తెలివిగా తప్పించుకుంటున్నాడు.
లేటెస్ట్ గా వాయిదా పడ్డ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించి ఆమధ్య ముంబాయిలో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో జూనియర్ తన ఉపన్యాసం చివరిన చేసిన ‘జైహింద్’ స్లోగన్ పై ఇప్పుడు రాజకీయ వర్గాలలో అదేవిధంగా ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా జాతీయ స్థాయి రాజకీయనాయకులు మాత్రమే తమ ఉపన్యాసాల చివర ‘జైహింద్’ స్లోగన్ ను ఉపయోగిస్తూ ఉంటారు.
దేశప్రజలలో భావోద్వేగాన్ని రెచ్చకొట్టడానికి ఈ స్లోగన్ బాగా ఉపకరిస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఉపన్యాసాల చివరిలో ఇలా ఆవేశంగా జైహింద్ స్లొగన్స్ ఇస్తూ ఉంటాడు. అయితే ఒక సినిమా ఫంక్షన్ లో జూనియర్ ఇలాంటి ఎందుకు ఇచ్చాడు అంటూ ఆశ్చర్య పోతున్నవారికి ఒక సమాధానం వినపడుతోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ స్వాతంత్ర ఉద్యమ నేపధ్యంలో తీయబడ్డ మూవీ.
1920 ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ ఉత్తర భారతదేశంలో ఒక చోట కలిసారు అన్న ఊహతో తీయబడ్డ మూవీ. దీనితో ఈ స్వాత్రంత్ర స్పూర్తిని నేటి తరం ప్రేక్షకులకు పరిచయం చేసే ఉద్దేశం ఉద్దేశ్యంతో తారక్ ఇలాంటి పొలిటికల్ స్లోగన్ ఎంచుకున్నాడు అనుకోవాలి. అయితే ఈ స్లోగన్ కు రాజకీయ రంగులు అలుముతూ జూనియర్ మనసులో రాజకీయ ఆలోచనలు ఉన్నాయి అంటూ అప్పుడే కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుత తరం ఫిలిం సెలెబ్రెటీలు ఎవరు రాజకీయాలలో రాణించలేకపోతున్న పరిస్థితులలో తారక్ తనపై తానే మరొక ప్రయోగం చేసుకుని తారా స్థాయిలో ఉన్న తన కెరియర్ కు విఘాతం ఏర్పరుచుకునే అవకాశాలు తక్కువ..