సిస్టర్ సెంటిమెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన కీర్తి సురేష్..!

Pulgam Srinivas
హీరోయిన్ లు టాప్ పొజిషన్ లో ఉన్న సమయంలో సిస్టర్ పాత్రలను చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు, దానికి ప్రధాన కారణం చెల్లెలు పాత్రలను చేసినట్లు అయితే ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే చేయాల్సి వస్తుందేమో అని వారి భావించడం, మరియు సిస్టర్స్ గా చేయడం వల్ల తమ క్రేజ్ ను కోల్పోతాము అని వారు భావించడం, మరియు ఇతర కారణాల వల్ల కూడా టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్ లు చెల్లెలి పాత్రలో నటించడానికి అంతగా ఇష్టపడరు. కానీ ఎంతోమంది హీరోయిన్ లకు భిన్నంగా కీర్తి సురేష్ మాత్రం స్టార్ హీరోలకు చెల్లెలిగా నటించడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న ఈ హీరోయిన్ మహానటి సినిమాతో తానేంటో, తన నటన ఏంటో నిరూపించుకుంది. అయితే ఇలా ఇంత గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన అన్నాత్తే (పెద్దన్న)  సినిమాలో రజనీకాంత్ కు చెల్లెలు పాత్రలో నటించింది.

 ఈ సినిమా తెలుగులో పెద్దగా విజయం సాధించకపోయినా తమిళ్ లో మాత్రం మంచి విజయం సాధించింది. ఇలా చెల్లెలు పాత్రతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన కీర్తి సురేష్, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమా లో చిరంజీవి కి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వేదళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా చెల్లెలు సెంటిమెంట్ పై కొనసాగుతుంది. ఇప్పటికే ఈ చిత్ర బృందం చిరంజీవి, కీర్తి సురేష్ లకు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేయగా దీనికి జనాల మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా కీర్తి సురేష్ తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పటికీ తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే చెల్లెలు పాత్ర చేయడానికి కూడా సిద్ధంగా ఉండి ఎంతో మంది హీరోయిన్ లకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: