హీరోయిన్ నదియా ప్రేమే.. కెరియర్ దెబ్బతీసిందా?

praveen
సినిమా వాళ్ల గురించి తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రేక్షకులు ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే ఏ వార్త తెర మీదికి వచ్చిన క్షణాల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే సినిమా హీరో హీరోయిన్ల గురించి ఎన్నో సార్లు సోషల్ మీడియాలో ఫకార్లు షికారు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా  హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారం ఉంది అంటూ వచ్చే వార్తలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. హీరో హీరోయిన్లు కలిసి ఒకటి రెండు సినిమాల్లో నటించడం...  సినిమాలు సూపర్ హిట్ కావడంతో.. వారికి ప్రేమబంధాన్ని అంటగట్టేస్తారు ప్రేక్షకులు.


 అయితే ఇలాంటి పుకార్లు కారణంగా ఫేమస్ అయిన హీరోయిన్లు కొంతమంది అయితే.. హీరోలతో ప్రేమాయణం అంటూ వచ్చిన వార్తలు కారణంగా ఎన్నో అవకాశాలను కోల్పోయిన వారు కొంతమంది హీరోయిన్లు. ఇలాంటి వారిలో చెప్పుకోవాల్సింది  ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ నదియా గురించి. ఒకప్పుడు హీరోయిన్గా తమిళ తెలుగు భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ల అవ్వా నడిపించింది నదియా. అయితే నదియా గురించి జరిగిన ఒక ప్రచారం మాత్రం ఆమెకు ఎన్నో అవకాశాలను దూరం చేసిందట.


 ఒకప్పుడు  హీరోగా బాగా రాణించిన సురేష్ తో కలిసి నదియా తమిళంలో ఒక సినిమాలో నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తర్వాత దర్శక నిర్మాతలు వీరిద్దరితో నే మరి కొన్ని సినిమాలను కూడా తీశారు. ఇంకేముంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లిచేసుకోబోతున్నారు అంటూ వార్తలు మొదలయ్యాయి. మేము స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చిన కూడా వార్తలు మాత్రం ఆగలేదు. చివరికి పుకార్లకు భయపడి సురేష్ తన సినిమాలో నదియాను తీసుకోవడానికి భయపడ్డాడట. ఒకరు నేపథ్యంతో నదియాతో సినిమా అనేసరికి ఇతర హీరోలు కూడా నో చెప్పారట. ఇలా నదియా ఎన్నో అవకాశాలను కోల్పోయినట్లు టాక్. తర్వాత సురేష్, నదియా వేరువేరు పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయ్యారు. ఇక ఇప్పుడు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్లుగా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: