జర్నలిజం చదివి.. సినిమాటోగ్రఫీ నేర్చుకుని.. స్టార్ హీరోయిన్ అయిన సినీ తార..!
ఇంతకీ మనం చెప్పుకునే హీరోయిన్ ఎవరో ఈపాటికి మీకు తెలిసే ఉంటుంది. ఆమె ఎవరో కాదు అలా మొదలైంది హీరోయిన్ నిత్యా మీనన్. 8 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ ఇంగ్లీష్ సినిమా లో నటించిన నిత్యా మీనన్. 17 ఏళ్ల వయసులో కన్నడ సినిమా లో సపోర్టింగ్ రోల్ చేసింది. నిత్యా మీనన్ గ్రాడ్యుయేషన్ తర్వాత మనిపాల్ యూనివర్సిటీలో జర్నలిజం కోర్స్ చేసింది. ఇక సినిమాల మీద ఆసక్తితో పూణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్స్ చేసింది.
అక్కడ తెలుగు దర్శకురాలు బి.వి నందిని రెడ్డితో పరిచయం ఏర్పడటంతో ఆమె చేస్తున్న అలా మొదలైంది సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది. తనని తాను ఎప్పుడు హీరోయిన్ గా ఊహించుకోలేని నిత్యా మీనన్ తెలుగులో కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టింది. ఎలాంటి ఎక్స్ పోజింగ్ లేకుండా పక్కింటి అమ్మాయి తరహాలో ఆమె నటన నిత్యా మీనన్ కు ప్లస్ అయ్యింది. అయితే ఈమధ్య ఆమె కెరియర్ లో చాలా వెనకపడ్డది. తెలుగులో ఆమె కెరియర్ కు దాదాపు ఎండ్ కార్డ్ పడినట్టే అని చెప్పొచ్చు. తెలుగులో గమనం సినిమా చేసిన నిత్యా మీనన్.. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తుంది. మరి ఈ సినిమాలతో అయినా తెలుగులో నిత్యా మీనన్ మళ్లీ బిజీ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి.