ఆర్ఆర్ఆర్ : వాయమ్మో రిలీజ్ అయ్యేది అప్పుడా .... ??

GVK Writings
వాస్తవానికి ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు అలానే ఓమిక్రాన్ విజృంభణ వంటివి లేకపోయినట్లైతే మరొక రెండు రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ మూవీని అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసేవారు. అయితే హఠాత్తుగా కరోనా అల్లకల్లోలం వల్లనే చాలా రాష్ట్రాల్లోని థియేటర్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీ విధించడంతో ఆర్ ఆర్ఆర్ ని వాయిదా వేసింది యూనిట్. ఎన్టీఆర్ కొమురం భీం గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ భారీ పేట్రియాటిక్ పాన్ ఇండియా మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక అటు ఎన్టీఆర్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ లో ఈ సినిమా పై ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా వాయిదాతో తదుపరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ఆడియన్స్ లో విపరీతంగా చర్చ జరుగుతోంది. కాగా లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీని ఏప్రిల్ లో రిలీజ్ చేద్దామని యూనిట్ భావించిందట. అయితే అప్పటికి మహేష్ సర్కారు వారి పాట, ఆ తరువాత భారీ పాన్ ఇండియా మూవీ కెజిఎఫ్, అలానే కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న బీస్ట్, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాల విడుదల ఉండడంతో వాటిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని రాజమౌళి, ఆపైన జూన్ లో రిలీజ్ చేద్దాం అని ఆలోచన చేశారట.
అయితే జూన్ కంటే కూడా అంతకముందు తొలిసారిగా ఆర్ ఆర్ఆర్ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన విధంగా జులై 30 న రిలీజ్ చేయడం బెటర్ అని దర్శకుడు రాజమౌళి సహా యూనిట్ మొత్తం ఆలోచన చేస్తోందట. మరోవైపు పూర్తిగా ప్రస్తుత కరోనా పరిస్థితులు అప్పటికి గాని పూర్తిగా కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, అందుకే ఈ డేట్ ఫిక్స్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదని అంటున్నారు. మరి పక్కాగా ఆర్ఆర్ ఆర్ జులై 30నే వస్తుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు ఆగాల్సిందే. ఒకవేళ అదే డేట్ కనుక ఫైనలైజ్ అయితే అమ్మో అప్పటివరకు ఆగాల్సిందేనా అంటూ ఇప్పటినుండే పలువురు టాలీవుడ్ ఆడియన్స్ ఆర్ఆర్ ఆర్ రిలీజ్ పై సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr

సంబంధిత వార్తలు: