ఇండస్ట్రీ రికార్డులు బద్ధలు కొట్టిన పోకిరి.. ఆ సినిమాతోనే సూపర్ స్టార్..!

shami
అప్పటివరకు ఘట్టమనేని వారసుడిగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ప్రిన్స్ మహేష్ గా స్టార్ స్టేటస్ ఉన్నా కెరియర్ లో ఓ మంచి బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్న మహేష్ కు పోకిరి హిట్ తిరుగులేకుండా చేసింది. పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో తెరకెక్కిన పోకిరి సినిమా సంచలనాలు సృష్టించింది. అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను సైతం తుడిచిపెట్టేసింది. సినిమాకు 50 రోజుల వరకు హౌజ్ ఫుల్ నడిచాయంటే సినిమా రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

మహేష్ కెరియర్ లో ఎప్పుడూ పోకిరి లాంటి రఫ్ రోల్ చేయలేదు. క్లాస్ లుక్ తో ఉండే మహేష్ మాస్ లుక్ లో.. ఓ రఫ్ గాయ్ లా చూపించడం ఫ్యాన్స్ కు బాగా ఎక్కేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా రికార్డులు బద్ధలు కొట్టింది. అప్పటివరకు స్టార్ గా మాత్రమే ఉన్న మహేష్ ని పోకిరి హిట్ సూపర్ స్టార్ ని చేసింది. అంతకుముందు ఒక్కడుతో కెరియర్ టర్న్ తీసుకున్న మహేష్ అతడు సినిమా మరో డిఫరెంట్ ఇమేజ్ తెచ్చింది. అతడు తర్వాతనే పోకిరి పడటంతో అభిమానులకు పండుగే అయ్యింది.

పోకిరి మహేష్ కెరియర్ లోనే కాదు తెలుగు సినిమా చరిత్రలో స్పెషల్ సినిమాగా నిలిచింది. అప్పుడు ఉన్న సినిమా టికెట్ల రేట్లతో 75 కోట్ల దాకా కలెక్ట్ చేసి అసలు సిసలైన బ్లాక్ బస్టర్ బొమ్మగా నిలిచింది పోకిరి. మహేష్ యాక్టింగ్, ఇలియానా అందాలు, మణిశర్మ మ్యూజిక్ ఇవన్ని సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక పూరీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. మహేష్ కెరియర్ గురించి చెప్పాలంటే పోకిరి ముందు.. పోకిరి తర్వాత అనే చెప్పాలి. అంతగా ఆయన కెరియర్ మీద ఇంప్యాక్ట్ క్రియేట్ చేసి మహేష్ ను మాస్ ఆడియెన్స్ కు దగ్గర చేసింది పోకిరి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: