బాహుబలి సినిమా తో ఒకేసారి పాన్ ఇండియా హీరో అయిపోయాడు మన ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. తను చేసిన సినిమాలు కూడా మంచి మంచి టాప్ దర్శకులకు తో మాత్రమే చేస్తున్నాడు. ప్రభాస్ నటించిన సాహో అనే ఇండియా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక బాలీవుడ్ లో ఈ సినిమా వంద కోట్లకు పైగానే సంపాదించింది. ప్రభాస్ నటించిన సాహో సినిమా విడుదలై దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇప్పుడు తాజాగా ప్రభాస్ రాధేశ్యాం ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఈ ఒక్క సినిమానే కాకుండా ప్రభాస్ 'ఆదిపురుష్', 'సలార్' వంటి సినిమాలు కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రాజెక్ట్ కే అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ స్పీరిట్ అనే సినిమా కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ సినిమాను అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఇకపోతే ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు అని సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి.
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత భూషణ్ కుమార్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని ఆయన తెలిపారు. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా అయితే ఎవరికీ కనిపించలేదు. ప్రభాస్ అన్న పోలీస్ ఆఫీసర్ గా చూడాలని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది మొదలు కానుంది. ఇక ప్రభాస్కు జోడిగా ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటించనున్నట్లుగా తెలుస్తోంది...!!