పవన్ కళ్యాణ్ పారితోషికం పై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు !

Seetha Sailaja

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అవకాశం చిక్కితే చాలు ఏదోవిధంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాప్ హీరోల పారితోషికం వ్యవహారం పై వస్తున్న విమర్శల పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రేట్లు పెంపుదల విషయంలో అదేవిధంగా ఇప్పుడు అమలు జరుగుతున్న టిక్కెట్ల రేట్ల పై అనేక విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.


ఈవిషయం పై కొంతమంది కొన్ని సూచనలు కూడ ఇస్తున్నారు. టాప్ హీరోలు తమ పారితోషికాన్ని తగ్గించుకుని నిర్మాతలకు సహకరిస్తే టిక్కెట్ల రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ సమస్య ఉండదని కొందరు సలహాలు ఇస్తున్నారు. ఈవిషయం పై స్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసారు. టాప్ హీరోలు తమ పారితోషికాన్ని ఎందుకు తగ్గించుకోవాలి అంటూ ఒక ఉదాహరణ కూడ చెప్పాడు.


సుమారు 2 కోట్లతో ఒక మెర్సిడీస్ కారు కొన్నప్పుడు అంత డబ్బు ఆకారు పై పెట్టి కొనాలా అన్న సందేహం కలిగినప్పటికీ ఆ బ్రాండ్ వ్యాల్యుకి మోజుపడి అన్ని కోట్లు ఖర్చు పెట్టి అలాంటి విలువైన కారును కొనుక్కుని సంతోషిస్తామని అన్నాడు. అంతేకాదు మెర్సిడీస్ కారులో ఉండే ఫిచర్స్ సౌకర్యాలు మోడరేట్ కార్లలో ఉన్నప్పటికీ వాటిని కొనడానికి చాలామంది గౌరవం తక్కువగా భావిస్తారని అలాగే టాప్ హీరోలకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోకు తక్కువ పారితోషికం ఇవ్వడానికి ఎవరి మనసు అంగీకరించదు అంటూ అది అతడి బ్రాండ్ వ్యాల్యు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.


ఇప్పుడు ఈ కామెంట్స్ పవన్ అభిమానుల మధ్య వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి టాప్ హీరోల పారితోషికం గురించి ఎవరు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ అనేకమంది నిర్మాతలు టాప్ హీరోలకు ఒకరితో ఒకరు పోటీ పడుతూ వారి పారితోషికాన్ని పెంచుతూనే ఉన్నారు. దీనితో ఎవరు ఎన్నిప్రయత్నాలు చేసినా టాప్ హీరోల పారితోషికాలు ఇప్పట్లో తగ్గేలా లేవు అన్నది వాస్తవం..  





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: