పెద్ద సినిమా లు.. ఓ టీ టీ ఆలోచనలు!!

P.Nishanth Kumar
ఇటీవల కాలంలో ఓ టీ టీ లో విడుదలయ్యే సినిమాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటి వరకు వచ్చిన చిన్న సినిమాలు మాత్రమే ఓ టీ టీ లో విడుదల అయ్యే విధంగా ప్లాన్స్ జరిగాయి. కానీ ఇప్పుడు పెద్ద సినిమాలు సైతం ఓ టీ టీ లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో థియేటర్ లలో చిత్రాలు విడుదలకు సిద్ధంగా లేకపోవడంతో వాటిని ఓ టీ టీ లో విడుదల చేసే విధంగా చిత్ర నిర్మాతలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

ఆ విధంగా పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు సైతం ఓ టీ టీ లో విడుదలయ్యే విధంగా ఇప్పుడు ముందుకు వెళుతూ ఉండడం విశేషం. సంక్రాంతి కానుకగా రెండు భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని అలరించాలని విడుదల తేదీలను కూడా ప్రకటించి దానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా నిర్వహించింది. అయితే ఆఖరి నిమిషంలో ఈ రెండు చిత్రాలు కూడా తమ సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేసుకున్నాయి. 

దాంతో తదుపరి నెలలో విడుదలయ్యే కొన్ని పెద్ద సినిమాలు ఓటీటీ లో వచ్చే విధంగా ప్లాన్స్ చేసుకుంటున్నాయి. ఓ టీ టీ వస్తే ఎలాంటి టెన్షన్ ఉండదు నిర్మాతల ఆలోచన కాబట్టి వచ్చే నెలలో వచ్చే పెద్ద సినిమాలు సైతం ఓ టీ టీలో విడుదల అవుతున్నాయి అన్న వార్త వినగానే ప్రేక్షకుల్లో కొంత ఆనందం కలిగించింది. ఈ నేపథ్యంలో రాజమౌళి ప్రభాస్ చిరంజీవి వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ వంటి వారు ఇప్పుడు తమ సినిమాల ఓ టీ టీ విడుదలలపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. వీరందరూ కూడా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: