ఏపీ టికెట్ ఇష్యూ: బడా నిర్మాతలు మౌనమేలనోయి...?
ఏపీ ప్రభుత్వం తగ్గించిన టికెట్ ధరలపై సినిమా రంగానికి చెందిన వారు అంతా అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఒక వైపు కొందరు మాత్రం ప్రభుత్వంతో ఈ విషయాన్ని సత్వరమే పరిష్కరించాలని పోరాడుతుంటే.... ఇండస్ట్రీ పెద్దలు అని చెప్పుకునే కొద్ది మంది మాత్రం ఉలుకు పలుకు లేకుండా గమ్మగున్నారు. అయితే వారెందుకు మౌనంగా ఉన్నారు తెలియదు? ఒకవేళ ఎంత పోరాడినా ఉపయోగం లేదు అనుకున్నారో? తెలియదు. మరి ఇంకేదైనా కారణంగా ఉందా అనేది తెలియదు. ఇలా అన్ని ప్రశ్నలు మాత్రమే అందరి చుట్టూ తిరుగుతున్నాయి.
కోట్లకు కోట్లు పెట్టు సినిమాలు తీసి ఇప్పుడు రోజులకు రోజులు పోస్ట్ పోన్ చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది. ఇకనైనా పెద్ద నిర్మాతలు అని పిలవబడే సో కాల్డ్ వారు అంతా స్వార్థం అనేది విడిచి పెట్టి, కళామతల్లిని నమ్ముకుని బ్రతుకుతున్న వారందరినీ దృష్టిలో పెట్టుకొని ముందుకు వచ్చి ఇప్పటికే పోరాడుతున్న వారితో కలిసి పోరాడి సమస్యను పరిష్కరిస్తారా అన్నది తెలియాలంటే కొద్ది రోజుల వరకు ఆగాల్సిందే. అయితే రెండు రోజుల క్రితం ఈ విషయంపై ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రం అంతా హాట్ టాపిక్ గా మారాయి.