ఆ స్టార్ హీరోని నమ్మి.. ఐదుగురు పిల్లల్ని కన్న పుష్పవల్లి?

praveen
హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించడం సర్వసాధారణం. కొంతమంది సహజీవనం చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పట్లో పెళ్లి అయిన హీరోలతో హీరోయిన్లు సహజీవనం చేయడం కాస్త తక్కువైంది. కాని ఒకప్పుడు మాత్రం దాదాపు అందరూ పెళ్లైన హీరోలు ఉండటంతో చాలా మంది హీరోయిన్లు హీరోలతో సహజీవనం చేసేవారు అని కూడా టాక్ ఉంది. అయితే ఇలా ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన పుష్పవల్లి చివరికి ఒక హీరో మాయలో పడిపోయింది. అది అప్పటికే ఆ హీరోకి రెండు పెళ్లిళ్లు అయినప్పటికీ అతని మీద నమ్మకం ఉంచి చివరికి సహజీవనం చేసి ఐదుగురు పిల్లలను కంది.


 పుష్పవల్లి ఎవరో కాదు అలనాటి బాలీవుడ్ ప్రముఖ నటి రేఖ తల్లి. ఇక ఆ స్టార్ హీరో ఎవరో కాదు జెమినీ గణేషన్. అయితే జెమినీ గణేషన్ కు ముందే పెళ్లి అయింది అన్న విషయం తెలిసి కూడా స్టార్ హీరోయిన్ గా మహానటిగా చిత్ర పరిశ్రమను ఏలిన సావిత్రి అతడి వలలో ఎలా పడింది అని ఇటీవలే మహానటి సినిమాలో నేటి ప్రేక్షకులు కూడా చూశారు. సావిత్రి జెమిని గణేషన్ పెళ్లి 1952 లో జరిగింది. అయితే సావిత్రితో పెళ్లికి అవ్వకముందే జెమినీ గణేషన్ పుష్పవల్లి సహజీవనంలో ఉన్నారట. వీరి బంధానికి పిల్లలు కూడా పుట్టారు. అది కూడా ఒక్కరో ఇద్దరో కాదు ఏకంగా ఐదుగురు పిల్లలు జెమినీ గణేషన్ పుష్పవల్లి బంధానికి గుర్తుగా పుట్టారు.



 ఏపీ లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర ఉన్నటువంటి పెంటపాడు గ్రామంలో  1926 జనవరి 3వ తేదీన జన్మించారు వెంకట పుష్పవల్లి తాయారు. ఐదో తరగతి వరకు చదువుకున్న ఆమె చిన్న వయసు నుంచి అందం నాట్యం ద్వారా ఎంతో మంది  ఆకర్షించే వారు. తర్వాత మొదటిసారి సంపూర్ణ రామాయణం అనే సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత మోహిని, మాయాశశిరేఖ పాత్రల్లో కూడా నటనతో ప్రశంసలు అందుకుంది. అయితే ముందుగా పుష్పవల్లి రంగాచార్య అనే వ్యక్తిని పెళ్లాడింది. తర్వాత కొన్ని కారణాలతో అతనితో విడాకులు తీసుకుంది. ఇక ఆ తర్వాత జెమినీ గణేషన్ వలలో పడింది పుష్పవల్లి. అప్పటికే జెమినీ గణేషన్ కి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. అయినప్పటికీ సహ జీవనం కొనసాగిస్తూ ఐదుగురు పిల్లలను కంది. తర్వాత ఎన్నో కష్టాలు పడి పిల్లలను  పెంచింది. పిల్లల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టింది. ఇలా అప్పట్లో స్టార్ హీరో కొనసాగిన జెమినీ గణేషన్ వల్ల ఐదుగురు పిల్లల్ని కనడమే  కాదు కెరియర్ మొత్తం నాశనం చేసుకుందట ఒకప్పటి స్టార్ హీరోయిన్ పుష్పవల్లి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: