సుమ 'క్యాష్' షో.. సంక్రాంతికి మామూలుగా ఉండదు?

praveen
సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు  ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఊరు వాడ అంతా పండుగ శోభను సంతరించుకుంటోంది. తెలుగు ప్రజలందరూ అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి కూడా ఒకటి అని చెప్పాలి. సంక్రాంతికి కొన్ని రోజుల ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో పండుగ శోభ సంతరించుకుంటుంది అని చెప్పాలి. అయితే కేవలం తెలుగు రాష్ట్రాలలో వాడ వాడ మాత్రమే కాదు తెలుగు బుల్లితెర పై కూడా సంక్రాంతి పండుగ వచ్చిందంటే సందడి మామూలుగా ఉండదు. అంతట పండగ  శోభను సంతరించుకుంటోంది. ప్రతి చానల్లో స్పెషల్ ఈవెంట్ లు ప్లాన్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటారు.



 ఇక ప్రేక్షకులందరినీ టీవీలకు అతుక్కుపోయేలా  చేయడానికి ప్రతి షో కొత్తగా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రతివారం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంజాయ్ మెంట్ పంచే క్యాష్ కార్యక్రమాన్ని కూడా ఎంతో స్పెషల్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సుమా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న  క్యాష్ కార్యక్రమం ఈటీవీలో ప్రసారమవుతుంది. ప్రతివారం ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటుంది.. ఇక ప్రతి వారం కూడా నలుగురు స్పెషల్ గెస్ట్ లు ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల సంక్రాంతి సందర్భంగా స్పెషల్ గా కార్యక్రమాన్ని ప్లాన్ చెయగా.. దీనికి సంబంధించి ప్రోమో సోషల్ మీడియా లో విడుదలైంది.



 ఇక సంక్రాంతి ఎపిసోడ్ కి టాలీవుడ్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న హీరో రాజశేఖర్ ఫ్యామిలీ మొత్తం విచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా లో విడుదలై వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో లో భాగంగా హీరో రాజశేఖర్ ఎంట్రీ అదిరిపోయింది అనే చెప్పాలి. సినిమా లెవెల్ లో ఎంట్రీ ఇచ్చి అభిమానులను ఆకర్షించారు. ఇక ఆ తర్వాత హీరో రాజశేఖర్ భార్య జీవిత రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివాని కూడా క్యాష్ స్టేజ్ పై సందడి చేశారు. ఇక ఈ ప్రోమో ఎంతో మంది అభిమానులను ఆకర్షిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: