అయ్య బాబోయ్ : పుష్ప డిలీట్ సీన్లతో.. 4 సినిమాలు?
మొదటి రోజు నుంచి కూడా ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంటూ దూసుకుపోయింది. అటు వసూళ్లలో కూడా తగ్గేదే లే అన్నట్లుగా రికార్డును సృష్టించింది పుష్ప సినిమా. ఇప్పటివరకు ఏకంగా 300 కోట్ల వరకు పుష్ప సినిమా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే సాధారణంగా సినిమా అంటే రెండున్నర గంటల పాటు నిడివి ఉంటుంది. కానీ పుష్ప సినిమా దాదాపు మూడు గంటల నిడివి ఉంది అన్న విషయం తెలిసిందే. ఎన్నో సీన్స్ డిలీట్ చేసిన తర్వాతే ఇక మూడు గంటల నిడివి వచ్చిందని సుకుమార్ ఒకకార్యక్రమంలో చెప్పుకొచ్చారు. అయితే ఇటీవలే సినిమా విడుదలై సూపర్ హిట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో పుష్ప డిలీటెడ్ సీన్స్ ని వరుసగా విడుదల చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.
ఇకపోతే పుష్ప డిలీటెడ్ సీన్స్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పుష్ప సినిమాలో దాదాపు 12 కోట్ల విలువైన సీన్లను డిలీట్ చేశారు అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ఖర్చుతో దాదాపు నాలుగు చిన్న సినిమాలు తీయవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదండోయ్ ఈ నాలుగు డిలీటెడ్ సీన్లు ఒక సినిమా అంతా ఫుటేజ్ ఉంటుందట. పాన్ ఇండియా మూవీ కావడంతో అవసరమైన దానికంటే కాస్త ఎక్కువ ఫుటేజ్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ట్లు తెలుస్తోంది. ఇక చివరగా ఫైనల్ కాపీ తీసుకువచ్చేందుకు ఎన్నో సీన్లను డిలీట్ చేయాల్సి వచ్చిందట. ఇలా భారీగా సీన్లను షూటింగ్ చేయడం వల్లే బడ్జెట్ కూడా బాగా పెరిగిపోయింది అన్న టాక్ కూడా ప్రస్తుతం వినిపిస్తోంది.