అదిరింద‌య్యా బంగార్రాజా!: ఆహా! ఏమి క‌ల‌రింగ్ ఏమి రియ‌లైజేష‌న్..

RATNA KISHORE
సినిమా ప్ర‌మోషన్ లో వివాదాలు అన్న‌వి వ‌ద్ద‌నుకుని చాలా జాగ్ర‌త్త‌తో నేర్పుతో మాట్లాడే మాట‌లు కొన్ని అప్పుడ‌ప్పుడూ హీరోల ముందు చూపును సంకేతిస్తాయి.. అవును! ప‌వ‌న్ మాదిరిగా నాగ్ మాట్లాడ‌గ‌ల‌డా? ఎందుకు మాట్లాడాలి? ఏపీ ప్ర‌భుత్వంతో క‌లిసి విందు భోజ‌నం చేయ‌గ‌ల నాగ్ ను మ‌నం ఏమీ అనకూడ‌దు..ఇండ‌స్ట్రీ పెద్ద‌లంతా ఇలా ఎవ‌రికి వారు దారులు వెతికి ఆఖ‌రికి ఓటీటీకి జై కొట్టేలానే ఉన్నారు.. సో ఇక‌పై నాగ్ ను చూసి ప‌వ‌న్, నాని నేర్చుకోవాలి లేదంటే దెబ్బ‌డిపోతారు.. అంతటి సేఫ్ జోన్ గేమ్ ఆయ‌న త‌ప్ప ఇంకెవ్వ‌రూ ఆడ‌రు..ఆడ‌లేరు కూడా! జ‌య‌హో నాగ్ మ‌రియు జ‌య‌హో జ‌గ‌న్ ..

నొప్పించ‌క తానొవ్వ‌క అన్న ధోర‌ణిలోనే మాట్లాడ‌డం లో చాలా నేర్పు ఉంది. నాగ్ కు ఆ నేర్పు తెలుసు.క‌నుక ఆయ‌నేం మాట్లాడినా ఇప్పుడు త‌ప్పించుకుని రేపు సినిమా రిలీజ్ ను సాఫీగా సాగించి ఒడ్డెక్కేందుకు చేస్తున్న లేదా చేసిన ప్రయ‌త్నం అంతా ఇవాళ మీడియా మీట్ లో స్ప‌ష్టం అయింది.రేప‌టి వేళ ఇదే ఆయ‌న సినిమా స‌క్సెస్ కు కార‌ణం కావొచ్చు.లేదా మ‌రో రూపంలో సినిమాకు ఓ సానుకూల ఫ‌లితం కావొచ్చు.అందుకే నిన్న‌మొన్న‌టి వేళ హీరో నానీ విష‌యంలో జ‌రిగిన త‌గాదాల నేప‌థ్యంలో చాలా జాగ్ర‌త్త ప‌డ్డాడు.

సినిమా స్టేజ్ మీద పొలిటిక‌ల్ ఇష్యూస్ మాట్లాడ‌కూడ‌దు..నేను మాట్లాడ‌ను..అని చెప్పాడు నాగ్.. బంగార్రాజు సినిమాకు సంబంధించి మీడియా మీట్ ను ఇవాళ నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా నాగార్జున కీల‌క‌మైన వ్యాఖ్యలు చేసి త‌ప్పించుకున్నారు కూడా! ఎందుకంటే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏం మాట్లాడినా త‌ల‌నొప్పే అన్న ఉద్దేశంతో  నాగార్జున ఈ పాటి జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌ని భావించి, ప్ర‌స్తుతానికి చ‌ర్చ‌ను ముగించేయ‌డ‌మే త‌ప్ప చేయ‌గ‌లిగిందేమీ లేదు.ఈ నేప‌థ్యంలో సినిమా బాగా వ‌చ్చింద‌న్న‌న‌మ్మ‌కం త‌ప్ప త‌న‌కు మ‌రేమీ గుర్తుకు రావ‌డం లేద‌ని  కూడా చెబుతూ ఎన్న‌డూ లేనిది డెస్టినీని న‌మ్ముకుని తాను ప్రేక్ష‌కుల ముందుకువ‌స్తున్నాన‌ని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: