మాస్ మహారాజా
రవితేజ మరోసారి
మాస్ సినిమాలతో చాలా బిజీగా మారాడు. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు రవితేజ. అయితే
రవితేజ తాజాగా నటిస్తున్న
సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఈ సినిమాలు కాకుండా
మాస్ మహారాజా సుధీర్
వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చిత్రబృందం చేయడం జరిగింది. ఇక
సంక్రాంతి నుంచి
సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనుంది.
ఈ సినిమాను
జనవరి 14న
పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమాను ప్రారంభించనున్నారు. అయితే ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమాకి కావలసిన నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం
రవితేజ నటించిన ఈ సినిమాలో
రవితేజ ను ఢీ కొట్టడానికి విలన్ గా ఈ సినిమాలో ఒక లేడీ నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే చిత్రబృందం ఈ పవర్ఫుల్ పాత్ర కోసం హీరోయిన్ను రంగంలోకి దించేందుకు రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాలో ఈ పాత్ర కు దక్షా నగార్కర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే చిత్ర యూనిట్ కథను వినిపించిన తర్వాత తనకు ఆ పాత్ర నచ్చి
దక్ష ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇక హుషారు సినిమాతో మొదటగా ప్రేక్షకులకు పరిచయమైన ఈ
తార జాంబి
రెడ్డి తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే
మాస్ మహారాజా
రవితేజ రావణాసుర సినిమాలో లాయర్ గా మనందరికీ కనిపించనున్నాడట.ఇక మరో వైపు
రవితేజ నటిస్తున్న ఖిలాడి
సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ
సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కి మంచి స్పందన లభించింది. ఇక
ఫిబ్రవరి 11 న ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!