టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత మూడేళ్లుగా రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతోనే బిజీగా గడిపారు. ఈ సినిమాకి ఓకే చెప్పడం వల్ల మరో సినిమాని కమిట్ అవడానికి అవకాశం లేకుండా పోయింది. అసలు ఇలా జరుగుతుందని ఈ ఇద్దరిలో అసలు ఊహించలేదు. అటు కరోనా మహమ్మారి కూడా ఆర్.ఆర్.ఆర్ సినిమా కు కోలుకోలేని దెబ్బ వేసింది అన్నీ చక్కబడ్డాయని ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో ప్లాన్ చేసి తీరా సినిమా విడుదల చేసే సమయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురై సినిమాను వాయిదా వేయక తప్పలేదు. దీంతో యావత్ దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నా మెగా, నందమూరి ఫాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అయితే ఈ షాక్ నుంచి అభిమానులను బయటపడేసేందుకు రామ్ చరణ్ ఓ గుడ్ న్యూస్ చెప్పినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం చరణ్ ఇంత కాలంగా ఎదురు చూశారు. కానీ ఇప్పట్లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం లేకపోవడంతో వెంటనే శంకర్ సినిమాలు మళ్లీ సెట్స్ పైకి తీసుకురావాలని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడట. రామ్ చరణ్ కెరియర్ లో 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సుమారు రెండు వందల యాభై కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందిస్తున్నారు. అంతేకాదు దిల్ రాజుకి ఇది 50వ సినిమా కావడం విశేషం.
ఇక సినిమాలో చరణ్ కి జోడీగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కేర్ అద్వాని కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి రెండు షెడ్యూల్స్ కూడా కంప్లీట్ చేశారు. ఇప్పటికే చరణ్ పై ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ తో పాటు హీరో, హీరోయిన్స్ మధ్య ఓ పాటను కూడా చిత్రీకరించారు. అయితే మధ్యలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ మొదలు కావడంతో చరణ్ ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ వాయిదా పడడంతో మళ్లీ శంకర్ సినిమాను మొదలు పెట్టబోతున్నాడట చరణ్. అంతే కాదు ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి మెగా ఫ్యాన్స్ కి ఇది కాస్త ఊరట అని చెప్పాలి...!!