రంగమార్తాండ లీక్స్.. షాక్ ఇస్తున్న ప్రకాష్ రాజ్ లుక్..!

shami
ఒకప్పుడు కృష్ణవంశీ సినిమా అంటే ఇండస్ట్రీతో పాటుగా ఆడియెన్స్ అంతా ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూసేవారు. ఆయన డైరక్షన్ లో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అయితే కాలం మారింది. కృష్ణవంశీలో క్రియేటివిటీ తగ్గింది. కొత్త టాలెంట్ వచ్చి పాత దర్శకులను వెనకపడేలా చేశాయి. పాత కొత్త అనే తేడా ఏం లేదు. ట్రెండ్ కు తగినట్టుగా సినిమాలు చేస్తూ వెళ్తే అదే ఆడియెన్స్ కు నచ్చుతుంది.
ఈ క్రమంలో కృష్ణవంశీ కొద్దిపాటి గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా రంగమార్తాండ. మరాఠీలో సూపర్ హిట్టైన నట సామ్రాట్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో అక్కడ నానా పటేకర్ నటించిన పాత్రలో ఇక్కడ ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు. రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి షూటింగ్ ఫోటోలు తప్ప సినిమా నుండి అఫీషియల్ పోస్టర్స్ ఇంతవరకు రిలీజ్ అవలేదు. రంగమార్తాండ చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.
ఈ షెడ్యూల్ లో సినిమాకు సంబందించిన మెయిన్ కాస్టింగ్ అంతా పాల్గొంటుందని తెలుస్తుంది. సినిమా షూటింగ్ స్పాట్ నుండి ప్రకాశ్ రాజ్ ఫోటో లీక్ అయ్యింది. ప్రకాశ్ రాజ్ వెరైటీ లుక్ ఆకట్టుకుంది. సినిమాతో ప్రకాశ్ రాజ్ తన నట విశ్వరూపం చూపిస్తాడని తెలుస్తుంది. సినిమాలో ప్రకాశ్ రాజ్ తో పాటుగా రమ్యకృష్ణ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, అలి రెజా, ఆదర్శ్ లు నటిస్తున్నారు. ఈ సినిమాతో కృష్ణవంశీ మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. సినిమాలో బ్రహ్మానందం ఎప్పటిలా కామెడీ పాత్రలో కాకుండా హృదయానికి హత్తుకునేలా సీరియస్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తుంది. కృష్ణవంశీ, ప్రకాశ్ రాజ్ కాంబినేషన్ అంటే సంచలనాలు సృష్టిస్తుంది. మరి కృష్ణవంశీ ఇన్నేళ్ల తర్వాత చేస్తున్న సీరియస్ గా చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సినిమాతో మాత్రం కృష్ణవంశీ టార్గెట్ గట్టిగా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: