మెగాస్టార్ కు జోడీగా పవన్ కళ్యాణ్ హీరోయిన్?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ వున్న హీరోయిన్గా కొనసాగుతుంది శృతిహాసన్. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి కొన్నాళ్లపాటు తన హవా నడిపించిన  ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మాత్రం మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తో చిత్ర పరిశ్రమకు దూరం అయింది. కానీ అక్కడ కలిసి రాకపోవడంతో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది శృతిహాసన్. ఇక ఈ అమ్మడికి ఎప్పటిలాగానే మళ్ళీ అదృష్టం కలిసి వచ్చింది. రవితేజతో కలిసి క్రాక్ సినిమా లో రీ ఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.


 ఇక క్రాక్ సినిమాతో తన అందం అభినయంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది శృతిహాసన్. దీంతో దర్శక నిర్మాతలు అందరి చూపు ఈ అమ్మడి పైన పడిపోయింది. మొన్నటి వరకు పాన్ ఇండియా సినిమాలకు బాలీవుడ్ ముద్దుగుమ్మలకు వైపు చూసిన దర్శక నిర్మాతలు ఇటీవల శృతి హాసన్ రాకతో వెంటనే సెలెక్ట్ చేసారు. ప్రస్తుతం శ్రుతి హాసన్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



 ఒకవైపు పాన్ ఇండియా మూవీ లో నటిస్తూనే మరోవైపు మరికొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సరసన నటించేందుకు సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ. మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్లో ఒక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ పట్టా లెక్క పోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరంజీవి తో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మ. అదే సమయంలో బాలక్రిష్ణ సినిమాలో నటించేందుకు కూడా శృతి హాసన్ ఓకే చెప్పింది అంటూ టాక్ వినిపిస్తోంది. అయితే గతంలో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో నటించి తన అందం అభినయంతో అందరినీ కట్టిపడేసింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: