ఇప్పుడు వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ కు రాదే శ్యామ్ కు మధ్య పోటీ తప్పదా..?

Pulgam Srinivas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా రాధే శ్యామ్ ఈ సినిమాకు జిల్ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించగా, ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది, ఎప్పుడో షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు గత కొన్ని రోజుల క్రితం చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఇలా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత అనూహ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.


  దీనితో రాదే శ్యామ్ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అన్నట్లు అనేక వార్తలు వచ్చాయి.  కాకపోతే రాదే శ్యామ్ చిత్ర బృందం ఈ సినిమాని చెప్పిన తేదీ జనవరి 14 వ తేదీనే విడుదల చేస్తాము అని తేల్చి చెప్పేసింది. అయితే ఆ తర్వాత దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం తమ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేయడం లేదు అని ప్రకటించింది. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాక రాధే శ్యామ్ చిత్ర బృందం కూడా తమ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయడం లేదు అని ప్రకటించింది. అయితే ఇలా ఒకసారి వారం రోజుల తేడాతో పోటీకి సిద్ధమయి విడుదలను వాయిదా వేసుకున్న ఈ రెండు సినిమాలు ప్రస్తుతం సమ్మర్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాదే శ్యామ్ సినిమాను మార్చి చివరలో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. అదే ఆర్ఆర్ఆర్ సినిమాను ఏప్రిల్ నెలలో విడుదల చేయాలనే  ఆలోచనలు చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే మరోసారి ఈ రెండు సినిమాల మధ్య పోటీ తప్పదు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: