ఏంటి నిజమే : ఆ విషయంలో మహేష్ కంటే నమ్రతదే పైచేయి .... ??

GVK Writings
టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, తండ్రి సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ ఆశీస్సులతో బాలనటుడిగా చిత్ర పరిశ్రమకి తెరంగేట్రం చేసారు. అప్పట్లో చాలా సినిమాల్లో నటించి అందరి నుండి మంచి పేరు అందుకున్న మహేష్, ఆపైన రాఘవేంద్ర రావు తీసిన రాజకుమారుడు మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో పెద్ద విజయం అందుకున్న ఈ సినిమా తరువాత కెరీర్ పరంగా మంచి అవకాశాలతో దూసుకెళ్లిన మహేష్, అనంతరం అనేక బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్స్ సొంతం చేసుకుని తండ్రికి తగ్గ తనయుడిగా టాలీవుడ్ నేటితరం సూపర్ స్టార్ గా కోట్లాదిమంది ప్రేక్షకాభిమానులు మనస్సులో గొప్ప స్థానం సంపాదించారు.
ఇక తన కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో, గతంలో తన మూడవ సినిమా వంశీలో హీరోయిన్ గా నటించిన నమ్రత శిరోద్కర్ ని ప్రేమించి అనంతరం పెళ్లాడిన మహేష్, ప్రస్తుతం ఇద్దరు బిడ్డల తండ్రిగా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అయితే మొదటి నుండి మహేష్, నమ్రతల మధ్య ఉన్న సఖ్యత ఇటీవల మరింతగా పెరిగిందని, ఇద్దరూ కూడా ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవిస్తూ ఉంటారని తరచు పలు సందర్భాల్లో మహేష్ సోదరి మంజుల, బావ సంజయ్ చెప్తూ ఉంటారు. ఆ విధంగా మంచి కపుల్ గా అందరికి ఆదర్శంగా కొనసాగుతున్న మహేష్, నమ్రత దంపతుల్లో వయసు పరంగా చూస్తే మహేష్ కంటే నమ్రత మూడేళ్లు పెద్ద. అయితే ఇది మాత్రమే కాదండోయ్, ఆస్తి విషయంలో కూడా మహేష్ కంటే నమ్రతదే పైచేయని సమాచారం.
వనితా శిరోద్కర్, నితిన్ శిరోద్కర్ దంపతులకు జన్మించిన నమ్రత 1993లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నారు. ఇక మహేష్ తో వివాహం సమయానికి ఆమెకు తన కుటుంబం నుండి కొన్ని వందల కోట్ల ఆస్తి సంక్రమించిందని, మొదటి నుండి వారిది కూడా ఎంతో పెద్ద రిచ్ ఫ్యామిలీ అని తెలుస్తోంది. అయితే నమ్రతతో వివాహం తరువాత తన జీవితం మొత్తం మారిపోయిందని, ప్రతి విషయంలో నాకు తోడు నీడగా ఉండే నమ్రత, ఇల్లు ఇతర బిజినెస్ వ్యవహారాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా తానే అన్ని దగ్గరుండి చూసుకుంటుందని, అటువంటి భార్య దొరకడం నా అదృష్టం అని పలు సందర్భాల్లో మహేష్ మాట్లాడుతూ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: