ప్రమోషన్ ల స్పీడు పెంచిన బంగార్రాజు..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు, ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తుండగా మరో ముఖ్యమైన పాత్రలో అక్కినేని నాగ చైతన్య కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. బంగార్రాజు సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదలైన బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే బంగార్రాజు సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు అమాంతం పెంచేశాయి.


 ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం కొద్ది రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. అయితే ఈ సినిమాకు సంక్రాంతికి పెద్దగా ఏ సినిమాలతో పోటీ లేదు. ఆర్ఆర్ఆర్, రాదే శ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాలను సంక్రాంతి బరిలో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందలు మొదట ప్రకటించాయి.  కాకపోతే ప్రస్తుతం దేశంలో కరోనా భారీగా విజృంభించడంతో ఈ సినిమాలను సంక్రాంతి కానుకగా విడుదల చేయడం లేదు. అయితే ఈ అంశం బంగార్రాజు సినిమాకు బాగా కలిసి వచ్చే పరిస్థితులు కనబడుతుంది. అయితే ఇలా ఈ సినిమాకు వేరే సినిమాల నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో ఈ చిత్ర బృందం కూడా ప్రమోషన్ ల స్పీడ్ పెంచి సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ చిత్ర బృందం ప్రెస్ మీట్ లను నిర్వహించి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: