ఓటీటీ లో 'శ్యామ్ సింగరాయ్'.. ఎప్పుడంటే..?

Anilkumar
శ్యామ్ సింగ రాయ్
సినిమా విడుదలై మంచి హిట్ ను అందుకుంది.బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతూ దూసుకుపోతోంది.నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి నటించిన ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ సినిమా నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. ఇక ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్‌తో నిర్మించారు.  నాని నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు సౌత్ భాషలలో కూడా రిలీజ్ 'శ్యామ్ సింగ రాయ్' చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నానికి మంచి కమర్షియల్ హిట్ ఇచ్చింది అని చెప్పాలి. 


ఇక అసలు విషయానికి వస్తే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ గా మారింది . ఇక త్వరలోనే శ్యామ్ సింగరాయ్ సినిమా   డిజిటల్‌ ప్రేక్షకులను అలరించేందుకు  సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ అయిన నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది. ఇక జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో కూడా  ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.  


అయితే త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయనున్నారట. ఇది సినిమా నిర్మాణ సంస్థలు పెట్టిన షరతుల ప్రకారం సినిమా థియేటర్లలో విడుదలయిన 90 రోజుల వరకు ఓటీటీలో విడుదల చేయకూడదు. అయితే కవిడ్ కారణంగా ఇది సాధ్యం కాదు అని అన్ని రోజుల వరకు సినిమాలు థియేటర్లలో కూడా ఉండే అవకాశం లేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే ఒక పక్క సినిమా ధియేటర్ లలో ఉండగానే ఓటీటీలో విడుదల చేసేస్తోంది మూవీ టీమ్.ఇక ఈ సినిమా అనంతరం నాని నూతన దర్శకుడి తో దసరా అనే సినిమాను చేస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలై మంచి రెస్పాన్స్ ఉంది ఈ సినిమాలో నాని కి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: