ఓటిటి బాట పడుతున్న విక్రమ్..

Purushottham Vinay
కోలీవుడ్ స్టార్ హీరోలు ఈ మధ్య ఓటిటిల బాట పట్టారు. ఇక కోలీవుడ్ లో మంచి స్టార్ హీరోగా దూసుకుపోతున్న విక్రమ్ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ అనేది ఉంది. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ స్టార్ హీరోకి ఈ మధ్యకాలంలో అసలు ఒక్క హిట్టు కూడా దక్కలేదు.ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా కాని అసలు వర్కవుట్ అవ్వడం లేదు. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు అన్ని కూడా బోల్తా కొట్టాయి. దీంతో తన తదుపరి సినిమాలపై విక్రమ్ ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు ఈ హీరో నటించిన సినిమాలను ఓటీటీలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది.కరోనా సమయంలో చాలా మంది స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను ఓటీటీల్లో విడుదల చేయడం జరిగింది. సూర్య, ఆర్య లాంటి స్టార్ హీరోలు ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేసి భారీ విజయాలను అందుకున్నారు.

ఇక స్టార్ హీరో సూర్య నటించిన 'ఆకాశమే నీ హద్దురా' ఇంకా 'జై భీమ్' లాంటి సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యి ఎన్నో రికార్డులు సృష్టించారు. ఇప్పుడు ఇక ఆయన నటిస్తోన్న కొత్త సినిమాను మాత్రం థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నారు.ఇక అలాగే సూర్యతో పాటు ఆర్య నటించిన 'సార్పట్ట' అనే సినిమా కూడా ఓటీటీలో విడుదలై అత్యధిక వ్యూస్ ను రాబట్టింది.ఇక అలా అటు సూర్య ఇంకా ఇటు ఆర్య ఇద్దరూ కూడా ఓటీటీ సినిమాల ద్వారానే మంచి హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు ఇదే రూట్ లో విలక్షణ నటుడు విక్రమ్ కూడా వెళ్లాలనుకుంటున్నారు. ఆయన నటిస్తోన్న 'మహాన్' ఇంకా అలాగే 'కోబ్రా' లాంటి సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయని సమాచారం తెలుస్తుంది. 'మహాన్' సినిమాను జనవరి 26 వ తేదీన ప్రైమ్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. మరో సినిమా 'కోబ్రా' ని కూడా నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికి డిస్కషన్స్ జరుగుతున్నాయి. మరి సూర్య ఇంకా ఆర్యల లాగానే విక్రమ్ కూడా మంచి సక్సెస్ అందుకుంటారేమో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: