అమ్మ బాబోయ్..కెరీర్లోనే బిగ్గెస్ట్ రిస్క్..ఆలోచించుకో చిట్టీ..?
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఫరియా అబ్దుల్లా దగ్గరకి ఓ అద్దిరిపోయే కధతో స్టార్ డైరెక్టర్ వచ్చి స్టోరి వినిపించాడట. స్టోరీ బాగా నచ్చడంతో అమ్మడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఇక్కడ షాకింగ్ ట్వీస్ట్ ఏమిటంటే ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో మదర్ గా మనకు కనిపించనుందట. ప్రస్తుత సమాజంలో భార్య భర్తలు చిన్న గొడవలే విడాకులు అంటూ పెద్ద పెద్ద డెసీషన్స్ తీసుకుంటున్న నేపధ్యంలో దీనే సినిమా గా తెరకెక్కిస్తున్నాడట ఆ డైరెక్టర్. విడాకులు తీసుకుంటే ఎలా ఉంటుంది..పిల్లలు ఎలా సఫర్ అవుతారు..విడాకులు తీసుకున్న అమ్మాయిని ఈ సమాజం ఎలా చూస్తుంది అనే కీ పాయింట్స్ పై స్టోరీ నడవబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాకి ఫరియా అబ్దుల్లా అయితే హోంలీ లుక్స్ తో బాగుంటుందని భావించిన డైరెక్టర్ ఆమెకు స్టోరీ వినిపించగా ఆమె కూడా ఇంప్రెస్ అయ్యి..గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఈ వార్త మీడియాలో లీక్ అవ్వడంతో ఫరియా అబ్దుల్లా అభిమానులు చిట్టిని ఈ సినిమా విషయంలో మరోసారి ఆలోచించుకో అంటూ సజీషన్స్ ఇస్తున్నారు. అప్పుడే మదర్ రోల్ లో నటిస్తే నీకు ఇంకా హీరోయిన్ గా ఆఫర్స్ ఇవ్వరు చిట్టీ ఆలోచించుకో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరీ చిట్టీ అభిమానుల మాట విని ఈ సినిమా నుండి తప్పుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి..!!