రాధే శ్యామ్: ప్రభాస్ ఖాతాలో మరో రికార్డ్..!!

Anilkumar
ప్రభాస్ నటించిన  'రాధే శ్యామ్‌' అప్ డేట్ కోసం ప్రభాస్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా కూడా ట్రైలర్ పై ఇంకా ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు. ఈ సినిమాపై హిందీ ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  హిందీ ప్రేక్షకులకు ఈ ట్రైలర్ బాగా నచ్చడంతో హిందీ ట్రైలర్ 1 మిలియన్ లైక్స్ అందుకుంది. అయితే రాధే శ్యామ్ సినిమాకు ఇదే గొప్ప రికార్డ్ అనుకుంటే ఇప్పుడు మరో సెన్సేషనల్ రికార్డును కూడా అందుకుంది. అయితే ఈ సినిమాను ఎక్కువమంది ప్రేక్షకులు చూసిన ట్రైలర్ గా కూడా ఇది రికార్డు క్రియేట్ చేయడం విశేషం.


 ఈ ఒక్క సినిమానే కాకుండా ప్రభాస్ నటించిన రెండు సినిమాల ట్రైలర్స్ కు 1 మిలియన్ లైక్స్ సాధించాడు ప్రభాస్. ఇక ప్రభాస్ గతంలో నటించిన సాహో సినిమాకు కూడా ఈ రికార్డు క్రియేట్ చేశాడు.  అయితే హీరో ప్రభాస్ ఖాతాలో ఇది మరో ఘనత. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాను చూసేందుకు ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ కాకుండా   అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇంతలా ఈ ట్రైలర్ ను ఇష్టపడడానికి గల కారణం అన్ని రకాల ఎమోషన్స్ ఈ ట్రైలర్ లో ఉండడం.అయితే ఈ సినిమా ట్రైలర్ 'అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు..


 నా జీవితంలో లో ప్రేమ పెళ్లి లేవు' అంటూ ప్రభాస్ వాయిస్ తో  మరింత ఆసక్తికరంగా మారింది.ప్రభాస్  'ప్రేమ పెళ్లి లేవు' అంటూనే.. అమ్మాయిలను ఫ్లర్ట్ చేసే కుర్రాడిగా ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్ లో ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమాలో నటించిన టాల్ బ్యూటీ పూజా హెగ్డే (ప్రేరణ) ఎంట్రీ కూడా అదిరిపోయింది. ఇక ప్రభాస్ ఖాతాలో రికార్డ్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు మరోవైపు రాజేశం వాయిదా ఫాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా నిరాశ గురిచేసింది ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాని మార్చి 18న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమాతో పాటు ఆదిపురుషా ప్రాజెక్టు కె ఒంటి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్...!!





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: