తెలుగు బిగ్‌బాస్‌ ఓటీటీలో కీలక మార్పులు.. అవేంటంటే..??

N.ANJI
బిగ్‌బాస్‌ ఈ షో గురించి తెలియని వారంటూ ఉండరు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఈ షో ఎంతగానో ఆకట్టుకుంది. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో హాలీవుడ్‌లో పుట్టి అన్ని భాషలకు విస్తరించింది. అలాగే తెలుగు బుల్లితెర ప్రేక్షకులను పరిచయమైంది ఈ షో. బిగ్ బాస్ తెలుగులో ఏకంగా ఐదు సీజన్స్ పూర్తి చేసుకొని ఆరో సీజన్ కి రెడీ అవుతుంది.

అయితే ఈ షోపై ఓపక్క విమర్శలు వస్తున్నా సరే.. బిగ్ బాస్ షోకి జనాలు కనెక్ట్ అవ్వడం అదే రేంజ్ లో  కొనసాగుతుంది. తెలుగులో ఈ షో టీఆర్‌పీ రేటింగ్స్‌ ఒక్కసారిగా పెంచేస్తుంది. అయితే తాజాగా బిగ్‌బాస్‌ ఓటీటీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. అదేంటో చూద్దామా.

ఇక ఇటీవల బిగ్ బాస్  5వ సీజన్‌లో విన్నర్‌గా సన్నీని ప్రకటించిన వెంటనే హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ కేవలం 2 నెలల్లోనే బిగ్‌బాస్‌ మళ్లీ ఆడియన్స్ ముందుకు వస్తుందని వెల్లడించారు. బిగ్ బాస్ సీజన్ 6లో సరికొత్తగా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అదేంటంటే.. 2 నెలల్లో వచ్చేది రెగ్యులర్‌ బిగ్‌బాస్‌ కాదని, ఓటీటీ వేదికగా వచ్చే బిగ్‌బాస్‌ అని నిర్వాహకులు స్పష్టంగా వెల్లడించారు.

అలాగే హిందీలో వచ్చిన మాదిరిగానే 24*7 టెలికాస్ట్‌ చేయనున్నట్లు, నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు కూడా నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు.. బిగ్‌బాస్‌ ఓటీటీ నిర్వాహణ బాధ్యతను ప్రముఖ బుల్లి తెర యాంకర్‌ ఓంకార్‌ సంస్థ అయిన 'ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌'కు అప్పజెప్పనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి  ఓటీటీలో ప్రసారమయ్యే ఎపిసోడ్స్‌ బాధ్యత ఓంకార్‌దే అని సమాచారం. అయితే హిందీలో కూడా బిగ్‌బాస్‌ రెగ్యులర్‌ షోకి సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌ గా వ్యవహరిస్తే.. ఓటీటీకి కరణ్‌ జోహర్‌ హోస్ట్‌ గా చేసిన నేపథ్యంలో తెలుగులో మాత్రం హోస్ట్‌గా నాగార్జున ఉంటారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: