అశ్ర‌ద్ధ వ‌ల్ల‌ ఆ విష‌యంలో నానా తిప్ప‌లు ప‌డుతున్న ప‌వ‌న్‌..?!

VUYYURU SUBHASH
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్ నేమ్ అంటారు ఆయ‌న అభిమానులు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. త‌న‌దైన న‌ట‌న‌, స్టైల్, మ్యాన‌రిజ‌మ్స్ తో అన‌తి కాలంలోనే యూత్‌లో సూప‌ర్ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. మెగా హీరోనే అయిన‌ప్ప‌టికీ.. టాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన సామ్రాజ్యాన్నే నిర్మించుకున్నాడీయ‌న‌.

అలాగే త‌న తొలి సినిమా `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`కి రూ. 5 వేల రెమ్యూన‌రేష‌న్‌ను అందుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 50 కోట్ల నుంచి 60 కోట్ల వ‌ర‌కు అందుకునే స్థాయికి ఎదిగాడు. అయితే సినిమాల ద్వారా కోట్లు సంపాదిస్తున్నా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఎప్పుడూ ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో నానా తిప్ప‌లు ప‌డుతూనే ఉంటార‌ట‌.
ఇందుకు కార‌ణం ప‌వ‌న్ ఆశ్ర‌ద్ధేన‌ట‌. పవన్ కళ్యాణ్ డబ్బు పట్ల అస్సలు శ్రద్ధ వహించ‌డ‌ట‌. అలాగే ఎవ‌రైనా ఇబ్బందుల్లో ఉన్నార‌ని తెలిస్తే వెంట‌నే త‌న ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బుతో వారికి సాయం చేసేస్తాడ‌ట‌. అందు వ‌ల్ల‌నే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని, అదే రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నప్పటికీ ఆయ‌న్ను ఎప్పుడూ ఆర్థిక స‌మ‌స్య‌లు వెంటాడుతూనే ఉంటాయట. ఇక ఎంత సంపాదించినా ఆయ‌న‌కు ఏమి మిగలద‌ని ప‌వ‌న్ స‌న్నిహితులు సైతం త‌ర‌చూ అంటుంటారు.

కాగా, ప‌వ‌న్ సినిమాల‌ విష‌యానికి వ‌స్తే.. `వ‌కీల్ సాబ్‌`తో లాంగ్ గ్యాప్ త‌ర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చిన ఈయ‌న ప్ర‌స్తుతం సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో `భీమ్లా నాయ‌క్‌` సినిమా చేశాడు. ద‌గ్గుబాటి రానా కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అలాగే ప‌వ‌న్‌ మ‌రోవైపు క్రిష్ డైర్‌క్ష‌న్‌లో `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`, హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో `భవదీయుడు భగత్‌ సింగ్‌` చిత్రాలు చేస్తున్నాడు. వీటితో పాటు మ‌రిన్ని ప్రాజెక్ట్స్ సైతం ప‌వ‌న్ చేతిలో ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: