‘బంగార్రాజు’ రన్‌టైమ్ ఎంతంటే?
ఈ చిత్ర దర్శకుడు తాజాగా మీడియాతో పలు విషయాలను పంచుకున్నాడు. అయితే 2014లో తొలుత నాగార్జున సొగ్గాడే కథను నెరేట్ చేసాడు. 2016లో సొగ్గాడే చిన్నినాయనా విడుదలయింది. ఆ రోజే బంగార్రాజు సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాం. ఈ మధ్యలో చైతన్యతో ఓ సినిమాను తీస్తే నాగార్జేనే నిర్మించారు. మా ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. నేను ఏమి చెప్పాలని అనుకుంటున్నానో ఆయనకు ఆటోమెటిక్‌గా అర్థమవుతుంది. ఆయన ఏమి చెప్పాలని అనుకుంటాన్నరో నాకు అర్థమవుతుంది. మా మధ్య కమ్యూనికేషన్ గ్యాబ్ అసలే లేదు. సొగ్గాడే చిన్ని నాయనా లైన్ నాదికాదు. రామ్మోన్ గారి పాయింట్. వేరే దర్శకుడిని ముందుగా అనుకున్నారు. నేను వేరే సినిమా కోసం నాగార్జున గారికి ఓ కథ వినిపించాను. ఆ కథ నావద్దకు వచ్చింది. పదిహేను రోజులు ఆ కథ మీద కూర్చున్నాను. ఆ తరువాత కథను నాగార్జున గారికి వినిపించాను. పస్ట్ నెరేషన్‌లో ఓకే అయింది.
సోగ్గాడే చిన్ని నాయన సినిమా విడుదలైన రోజు 'బంగార్రాజు' సినిమా చేయాలని అనుకున్నాం. కానీ చైతన్యతో ముందు ఓ సినిమా చేయమని నాగార్జున చెప్పారు. కరోనా కారణంగా ఇంకా ఆలస్యమైంది. సోగ్గాడే సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజు రాబోతున్నది. కాదు. రెండు సినిమాలను కలిసి చూస్తే ఐదు గంటలు అవుతుంది. ముఖ్యంగా సొగ్గాడే ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ బంగార్రాజు ప్రారంభమవుతుందని దర్శకుడు వెల్లడించారు.
కరోనా కారణంగా సంక్రాంతి రేస్‌లోంచి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి సినిమాలు వాయిదా వేయడంతో బంగార్రాజుకు కలిసొచ్చింది. సొగ్గాడే చిన్నినాయనా సినిమాకు ఈ మూవీ ప్రీక్వెల్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రెండు గంటల నలభై నిమిషాల పాటు నిడివితో రానున్నది. మరొకవైపు సంక్రాంతికి ఫర్‌ఫెక్ట్ మూవీ బంగార్రాజు అని టాక్ వినిపిస్తోంది. సెన్సార్ బోర్డు నుంచి కూడా ఈ చిత్రానికి ప్రశంసలు వచ్చినట్టు తెలుస్తోంది. సినిమా అంతా సరదాగా సాగిపోతుందని, పండుగకు కుటుంబం అంతా కలిసి ఎంజాయ్ చేయవచ్చు అని సమాచారం. ముఖ్యంగా నాగార్జున, నాగచైతన్య మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ అలరిస్తాయని ఈ మూవీకి హైలెట్‌గా నిలుస్తాయి అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ వర్కవుట్ అయితే సినిమా రేంజ్ మరింత పెరుగుతుందని సమాచారం. సంక్రాంతి సందర్బంగా జనవరి 14న విడుదలయ్యే 'బంగార్రాజు' ఫలితం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి మరీ.