యేసు దాసు : స్వామి గీతాలే పాడెదను? ఆకలిని జయించిన పాట
చలి గాలుల రాకలతో
లోపలి ఉక్కపోతలు తొలగిపోతాయి
బాహ్య సుఖాలకూ
లోపలి దుఃఖాలకూ మధ్య అంతరం
పెరిగిపోతుంది
సుఖం ఐహికం దుఃఖం జన్మ కారణం
దుఃఖాలను మోసుకు వచ్చిన ఈ కాలానికి
విరుగుడు సాధ్యమా.. నిలువరింత సాధ్యమా
మీ బిడ్డలతో మీరు మీ మీ కాలాలతో మీరు
చెప్పానుగా సమం అన్నది లేదు
సమ స్థాయి అన్నదే ఓ భ్రమ
సంగీతంలో కాదు సంగీతంతో సమం అన్నది లేదు సముద్రానికి
సమం అయిన రీతి ఎవ్వరిలోనూ లేదు దానిని అసాధ్యత అని అనాలి
ఇవాళ యేసయ్య (కట్టశేరి జోసఫ్ యేసు దాసు) పుట్టిన రోజు
మండే షైనింగ్స్ : మానవ వీధులలో జ్ఞాపక సంచారం
ఇవాళను పోలిన ఇవాళ రేపటిని పోలిన ఇవాళ ఉంటుందా..కాలం కొన్నింట ప్రశ్నలుగా మెరిసి ఆకట్టుకోని జవాబులకు ఆనవాలు అవుతుంది.వెలవెలబోయే జీవితాల చెంత యేసు దాసు ఉన్నారు. ఉపదేశ సారం ఒకటి జీవితానికి అనుగామిగా ఉంటుంది.ఏ వేళ అయినా సవాళ్లనో సందిగ్ధతనో వద్దనుకుని పోవడం ఎవ్వరి తరం.బాధగా గడిచే రోజు నాన్న గుర్తుకువస్తాడు.నాన్నను చివరి దశలో చూసిన జ్ఞాపకం ఒకటి గుర్తుకువస్తుంది ఆయనకు.జ్ఞాపకం చేసిన గాయాలు మళ్లీ మళ్లీ కొత్తగా కనిపిస్తాయి.బాధకు కొనసాగింపు ఇచ్చి ఇంకొంత దుఃఖాలను అదనపు కానుకలుగా చేస్తుంది. గత కాలాన నేను అలానే ఉన్నాను.ఇప్పుడూ అలానే ఉన్నాను.నా మార్పు అన్నది స్వరంలో ఉందా లేదా వెల్లడిలో ఉందా అన్నదే ముఖ్యం.మీరు మీ బిడ్డలూ అంతా సంస్కృతికి వారసులు అయి తీరాలి.
- రత్నకిశోర్ శంభుమహంతి