రామ్ చరణ్, రానా, శర్వానంద్.. ఈ ముగ్గురికీ ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా?
రానా దగ్గుబాటి.. టాలీవుడ్ బడా నిర్మాత డి.సురేష్ బాబు కుమారుడీయన. ఆయన అండ దండలతోనే `లీడర్` సినిమాతో హీరోగా పరిచయం అయిన రానా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `బాహుబలి` సినిమాలో విలన్‌గా విశ్వ రూపం చూపించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ చిత్రాల్లోనూ నటించి భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న రానా దగ్గుబాటి బుల్లితెరపై హోస్ట్‌గా కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఇక శర్వానంద్ విషయానికి వస్తే.. ఈయనకు ఎటు వంటి బ్యాక్‌గ్రౌండ్ లేక పోయినా ఇండస్ట్రీలో స్వయం కృషితో బాగానే నిలదొక్కుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో చిన్న చిన్న పాత్రలను పోషించిన శర్వా నంద్.. గమ్యం సినిమాలో పూర్తి స్థాయి హీరోగా నటించి సూపర్ క్రేజ్‌ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత విభిన్నమైన చిత్రాలు చేస్తూ తెలుగు ప్రేక్షలకు బాగా దగ్గరయ్యాడు. యూత్‌లోనూ శర్వాకు మంచి ఫాలోయింగ్ ఉంది.
అయితే రామ్ చరణ్, రానా, శర్వానంద్ లకు ఉన్న కామన్ పాయింట్ ఏంటీ అంటే.. ఈ ముగ్గురూ బాల్యంలో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో రామ్ చరణ్, రానా, శర్వాలు విద్యా భ్యాసం చేశారు. చాలా ఏళ్లు కలిసి చదువుకున్నా వీరి మధ్య ఎప్పుడూ సినిమాల ప్రస్తావన వచ్చేది కాదట. అప్పుడు ఎవరికీ సినిమాల గురించి అంత అవగాహనా లేదు. కానీ, సీన్ కట్ చేస్తూ ముగ్గురూ హీరోలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేశారు.