నిర్మాత వారసుడి కోసం ఇంత మంది స్టార్ హీరోలా..?
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఎన్టీఆర్ ఈ ట్రైలర్ ను విడుదల చేయడంతో నందమూరి అభిమానుల్లో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలోని పాటలు లాంఛ్ చేయడానికి ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ సిద్ధమవుతున్నాడు. ఈరోజు రాత్రి 7 గంటలకు ఈ సినిమాలోని పాటను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు అల్లు అర్జున్. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి పాన్ ఇండియా హీరోలైన ప్రభాస్, రామ్ చరణ్ తమ వంతు సహాయం చేసిన విషయం తెలిసిందే.
మొత్తంగా చూసుకుంటే ప్రభాస్ అభిమానులు ,రామ్ చరణ్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులతో పాటు బన్నీ అభిమానులు కూడా ఈ సినిమాపై మరింత అంచనాలు పెట్టుకున్నారు. ఒక్క సినిమాకు ఇంత మంది స్టార్ హీరోలు సపోర్ట్ చేస్తున్నారు అంటే కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుందని చెప్పడం ఖాయం. ఇక ఈ హీరో కి ఇంత మంది స్టార్ హీరోలు సపోర్ట్ చేయడానికి గల కారణం ఏమిటంటే.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమారుడు.. అంతేకాదు దిల్రాజు తాజాగా మా ఫ్యామిలీ నుంచి కూడా ఒక హీరో వచ్చాడు అంటూ హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.