నాని డైరక్టర్ల వెంటపడ్డ చరణ్.. మరో డైరక్టర్ కి ఛాన్స్..?

shami
మెగా పవర్ స్టార్ రాం చరణ్ తన పంథా మార్చేశాడు. ఒకప్పుడు స్టార్ డైరక్టర్స్ ని మాత్రమే నమ్మిన చరణ్ ఇప్పుడు వారితో పాటుగా యువ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నాడు. రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉండగా తన 15వ సినిమా శంకర్ డైరక్షన్ లో ఈమధ్యనే మొదలు పెట్టారు. ఈ సినిమా తర్వాత జెర్సీ ఫేం గౌతం తిన్ననూరితో చరణ్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. నానితో జెర్సీ సినిమా చేసి హిట్ అందుకున్న గౌతం తిన్ననూరి ఆ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేశాడు.
ఇక లేటెస్ట్ గా నాని నటించిన శ్యాం సింగ రాయ్ సినిమాతో హిట్ అందుకున్న రాహుల్ సంకృత్యన్ తో కూడా చరణ్ సినిమా ఉండబోతుందని టాక్. నానితో రాహుల్ చేసిన శ్యాం సింగ రాయ్ సినిమాతో టాలెంట్ చూపించాడు రాహుల్ సంకృత్యన్. మొదటి సినిమా ట్యాక్సీవాలా చేసి మెప్పించిన రాహుల్ రెండో సినిమా శ్యాం సింగ రాయ్ తో కూడా హిట్ అందుకున్నాడు. శ్యాం సింగ రాయ్ సినిమా చూసిన చరణ్ డైరక్టర్ ప్రతిభని మెచ్చుకున్నాడు.
శ్యాం సింగ రాయ్ ప్రమోషన్స్ లో తన దగ్గర స్టార్ హీరోలకు సరిపడే కలక్షన్స్ ఉన్నాయని చెప్పాడు రాహుల్ సంకృత్యన్. చరణ్ ప్రశంసలు అందుకున్న రాహుల్ చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేయబోతున్నాడని తెలుస్తుంది. కథ నచ్చితే చరణ్ కూడా రాహుల్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. గౌతం తిన్ననూరి సినిమా కూడా పాన్ ఇండియాగా రాబోతుండగా రాహుల్ సినిమా కూడా ఓకే అయితే మాత్రం తప్పకుండా ఈ మూవీ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉండే ఛాన్స్ ఉంది. తన దగ్గర ట్రైం ట్రావెల్ కథ ఒకటి ఉందని చెప్పిన రాహుల్ ఆ కథ ఎవరితో చేస్తాడో అని ఆడియెన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: