సాగర కన్య కంటే అద్భుతంగా మారిన రష్మిక..!!

Divya
రష్మిక మందన్న.. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి యువ హీరో నాగ శౌర్య హీరోగా ఛలో సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ కన్నడ ముద్దుగుమ్మ.. అయితే తాజాగా ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతూ ఉంది అని చెప్పవచ్చు.. చివరిగా పుష్ప చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ సూపర్ హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. సుకుమార్ - అల్లు అర్జున్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. 2021 డిసెంబర్ 17 వ తేదీన ఈ సినిమా విడుదల అయినప్పటికీ ఈ ఏడాది మొదట్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా పుష్ప సినిమా రికార్డు సాధించడం గమనార్హం.

ఇకపోతే ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అంతేకాదు ఈమె కోసం నిర్మాతలు కూడా ఎదురుచూస్తూ ఉన్నారు.. అందుకే తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. కేవలం తెలుగు మాత్రమే కాదు హిందీ కూడా గుడ్ బై , మిషన్ మజ్ను వంటి సినిమాలు చేస్తోంది. మరోవైపు ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా కూడా చకచకా కంప్లీట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించబోతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది..

మరోవైపు పుష్ప సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప ది రూల్ అనే సినిమా రెగ్యులర్ షూటింగ్ లో కూడా భాగం అవ్వడానికి తనను తాను కొత్తగా సిద్ధం చేసుకుంటోంది.. ఇకపోతే తాజాగా ఫిష్ కట్ డ్రెస్ వేసుకొని ఎద అందాలను చూపిస్తూ సాగరకన్య కంటే అద్భుతంగా చూపరులను ఆకట్టుకుంటోంది రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా రష్మిక అందాలకు ఫిదా అవుతున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: