అలాంటి డ్రెస్ లో అదరగొడుతున్న మంచు లక్ష్మి..!

Pulgam Srinivas
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి, సిద్ధార్థ్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన అనగనగా ఓ ధీరుడు సినిమాలో ప్రతినాయక పాత్రలో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఈ సినిమాలో మంచు లక్ష్మి నటనకు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న మంచు లక్ష్మి ఆ తర్వాత కూడా అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది.
 


కేవలం సినిమాలు మాత్రమే కాకుండా అనేక టీవీ షో లకు, ఓటిటి షో లకు కూడా హోస్ట్ గా కూడా వ్యవహరించింది. అలాగే వెబ్ సిరీస్ ల ద్వారా కూడా ప్రేక్షకులను మంచు లక్ష్మి అలరించింది. ఇలా సినిమాలతో, వెబ్ సిరీస్ లతో, టీవీ షోలు, ఓటిటి షోలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తన డైలీ ఆక్టివిటీస్ ను, తన షూటింగ్ అప్డేట్ లను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉండే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తన అందచందాలు ప్రదర్శితమయ్యే ల ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఫోటో ను   పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఈ ముద్దుగుమ్మ డిఫరెంట్ లుక్ ఉన్న ఒక  డ్రెస్సు ను వేసుకొని, కాళ్లకు పొడుగాటి షూ వేసుకుని అదిరిపోయే లుక్ లో ఫోటోకి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మి కి సంబంధించిన ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: