వావ్:నందమూరి హీరోకి బాబాయ్ గా మారనున్న: రాజశేఖర్..!!

Divya
జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ సినిమా 2016 సెప్టెంబర్ 1న బ్రహ్మానందం గా విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. ఎన్టీఆర్ ఇందులో చెప్పే డైలాగ్ లు ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఒక మెట్టు పైకి ఎదిగారని చెప్పవచ్చు.. ఇక డైరెక్టర్ కొరటాల శివ కూడా ఎన్టీఆర్ ని ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా చూపించారు అని చెప్పవచ్చు. తన పాత సినిమాలకు భిన్నంగా ఎన్టీఆర్ ఇందులో ఉండడం గమనార్హం. అయితే తాజాగా మరి వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. అయితే కొరటాల శివ ఈ సినిమాని.. యువ సుధా ఆర్ట్స్ బ్యానర్, ఎన్టీఆర్ బ్యానర్ పై.. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఈ సినిమాని నిర్మించబోతున్నారు సమాచారం. ఇక ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వాని హీరోయిన్ గా నటించబోతుందని వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాపై మరో ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో బాగా వైరల్ గా మారుతోంది.

అదేమిటంటే అలనాటి హీరో డా. రాజశేఖర్ తన నటనతో, డైలాగ్ లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటా ఉంటాడు. ఇక ఈ హీరోని ఎన్టీఆర్ కు బాబాయ్ గా ఈ సినిమాలో కనిపించే విధంగా ప్లాన్ చేసినట్లుగా సమాచారం. వార్త నిజమో కాదో తెలియదు కానీ నిజమైతే ఈ సినిమా ఓ రేంజ్లో ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా డేట్ ను కూడా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించడం. ఈ ఏడాది ఏప్రిల్ 22న విడుదల చేయబోతున్నట్లు గా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: