బోయపాటి హీరో మారుతున్నాడా!!
రామ్ చరణ్ తో ఎన్నో అంచనాల మధ్య తీసిన వినయ విధేయ రామ సినిమా భారీ స్థాయిలో విడుదల కాగా తుస్ మంటూ ఒక్కసారిగా ఈ సినిమా భారీ ఫ్లాప్ ను ఎదుర్కొంది. లయితే ఆ సినిమా తాలూకు ఫ్లాప్ డైరెక్టర్ కి మాత్రమే వచ్చేలా పరిస్థితి జరిగింది. దాంతో ఒక్కసారిగా తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా డౌన్ అయిపోయాడు బోయపాటి శ్రీను. ఈ నేపథ్యంలోనే తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పే విధంగా ఉండాలని ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించగా ఈ చిత్రం ఆయన ఊహించినట్లే సూపర్ హిట్ గా నిలిచి ఇద్దరికీ మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది.
ఈ నేపథ్యంలోనే ఆయనతో సినిమా చేయాలని చాలా మంది హీరోలు ముందుకు రాగా బోయపాటి శ్రీను మాత్రం అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అంతేకాదు ఇటీవల ఓ కథ ను కూడా వినిపించి అల్లు అర్జున్ తో కూడా ఓకే అనిపించుకున్నాడు. తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది అని అందరూ భావించారు. కానీ ఇంతలోనే ఏమైందో ఏమో అక్కినేని నాగ చైతన్య తో సినిమా చేసే విధంగా ఉన్నాడు అని వార్తలు రావడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. హీరో ఎవరైనా కూడా ఫర్వాలేదు కానీ ఇంత త్వరగా నిర్ణయాలు మార్చుకోవడం ఆల్మోస్ట్ ఓకే అనుకున్న సినిమా క్యాన్సిల్ అయిపోవడం వెనుక కారణాలు ఏంటి అనేది వారికి సమాధానం ప్రశ్నలుగా ఉన్నాయి.