షాక్:లైంగిక వేధింపుల దాడి కేసు లో స్టార్ హీరో..!!
పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు దిలీప్ తో పాటు ఆయన స్నేహితులు కూడా పోలీసులను బెదిరించినట్లు అందుకు తగిన ఆడియో క్లిప్ ను కూడా బయటకు వచ్చాయి.. ఇక దీంతో దిలీప్ తో పాటు ఐదు మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.. ఇక ఈ కేసులో మొదటి నిందితుడిగా దిలీప్ కుమార్ ఉండగా అతని సోదరుడు ,అలాగే బావమరిది రెండు, మూడవ నిందితులుగా ఉన్నారు.. దర్శకుడు బాల చంద్రకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం దిలీప్ తో పాటు ఆ వ్యక్తులు దర్యాప్తు అధికారుల ప్రాణాలకు హాని కలిగించడానికి ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది..
2017 లో ఒక మలయాళం నటి పై అత్యాచారం చేసిన కేసులో ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ పేరు రావడంతో సంచలనంగా మారింది.. ఇకపోతే గత ఐదు సంవత్సరాలుగా ఈ కేసు కోర్టులో నడుస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే ఆయన కూడా కొన్ని వారాల నుంచి జైల్ లోనే ఉన్నారని జనవరి ఐదో తేదీన ఢిల్లీలో మరో ఆరు నెలల పాటు పొడిగించాలని కోరుతూ కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఈయన కేసులో మరిన్ని కొత్త పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సి ఉంది.